
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్ :- భారత్ మరియు సౌత్ ఆఫ్రికా మధ్య తొలి టెస్ట్ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో ప్రారంభమైన నేపథ్యంలో మొదటి రోజే భారత స్టార్ క్రికెటర్, కెప్టెన్ గిల్ కు మెడ నొప్పి కారణంగా రిటైర్డ్ హర్ట్ అయిన విషయం తెలిసిందే. అయితే ఆ మెడ నొప్పితో బ్యాటింగ్ చేయలేక వెంటనే మైదానాన్ని కూడా వీడారు. డక్ ఔట్ లో కూర్చున్న గిల్ కు మెడ నొప్పి తీవ్రం కావడంతో వెంటనే ఆంబులెన్స్ లో కోల్కతాలోని వుడ్ ల్యాండ్స్ ఆసుపత్రిలో చేర్చారు. అతని గాయాన్ని పరిశీలించిన వైద్యులు సర్వైకల్కాలర్తో స్ట్రక్చర్ పై తీసుకు వెళ్ళడంతో ఆయనకు సివియర్ ఇంజురీ అయినట్లు.. ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. అయితే గిల్ ఆరోగ్య పరిస్థితిపై బీసీసీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన అయితే విడుదల చేయలేదు. మెడ నొప్పి తీవ్రంగా కావడంతోనే గిల్ కూడా కేవలం 3 బంతులు మాత్రమే ఆడి మైదానాన్ని విడిచి వెళ్లారు. డాక్టర్లు పరిశీలించి పూర్తిస్థాయి నివేదిక ఇచ్చిన తర్వాతనే గిల్ ఆరోగ్యంపై వివరణ ఇస్తాము అని బీసీసీఐ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే గిల్ ఐసీయూలో చికిత్స పొందుతున్నారు అనేది ఎంతవరకు నిజమో అన్నది కచ్చితంగా చెప్పలేం. దీంతో గిల్ కు ఏం కాకూడదు అంటూ తమ అభిమానులు వివిధ దేవుళ్ళను ప్రార్థిస్తున్నారు. త్వరగా కోలుకొని మైదానంలోకి తిరిగి అడుగు పెట్టాలి అని కోరుకుంటున్నారు. మరోవైపు శ్రేయస్ అయ్యర్ కూడా ఐసీయూలో చికిత్స పొంది ప్రస్తుతం పూర్తిగా కోలుకుంటున్నారు.
Read also : శబరిమల వెళ్లే అయ్యప్ప స్వాములకు హెచ్చరిక!
Read also : ”దమ్ముంటే పట్టుకోండి” అన్నాడు.. చాలా సింపుల్ గా పట్టుకున్నారు : సివి ఆనంద్





