
క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సర్వం సిద్ధమైంది అనడంలో ఎటువంటి సందేహం. ఇవాళ సాయంత్రం లోపు ఎన్నికల ప్రచారం ముగియనుంది అని అధికారులు ఇప్పటికే వెల్లడించారు. ఈనెల 11వ తేదీన జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా ఇప్పటికే స్కూళ్లకు, కాలేజీలకు మరియు ఆఫీసులకు సెలవులు ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. పోలింగ్ కు ముందు రోజు అనగా రేపు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన స్కూలు మరియు ఆఫీసులకు మాత్రమే సెలవులు ఇవ్వనున్నారు. ఇక పోలింగ్ రోజు 11వ తేదీన నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలకు అలాగే ఆఫీసులకు సెలవులు ఇచ్చారు. మరోవైపు 14వ తేదీన కౌంటింగ్ నాడు లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేసిన ప్రదేశాలలో మాత్రమే సెలవులు ప్రకటించనున్నారు. ఇప్పటికే ఉపఎన్నిక కోసం పారా మిలిటరీ బలగాలు కూడా జూబ్లీహిల్స్కు చేరుకున్నాయి. జూబ్లీహిల్స్ ఓపెన్ ఎన్నికల నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ భార్యకే టికెట్ ఇచ్చారు. మరోవైపు నవీన్ యాదవ్ గెలుపు కోసం శతవిధాలుగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది.ఇంకోవైపు జూబ్లీహిల్స్ లో ఈసారి కాషాయ జెండాను ఎగరవేస్తామని బిజెపి పార్టీ సర్వశక్తుల ప్రయత్నాలు చేస్తుంది. ఇక ఈరోజు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తుది దశకు చేరడంతో ఇప్పటివరకు హోరాహోరీ గా సాగినటువంటి ప్రచారానికి మరికొన్ని గంటల్లోనే తెరపడనుంది. దీంతో ఈ జూబ్లీహిల్స్ ఎన్నికలలో ఎవరు గెలుస్తారా అని ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Read also : బీహార్ ఎన్నికల ఎఫెక్ట్.. తెలంగాణలో లోడింగ్, అన్లోడింగ్ సమస్యలు!
Read also :బీహార్ ఎన్నికల ఎఫెక్ట్.. తెలంగాణలో లోడింగ్, అన్లోడింగ్ సమస్యలు!





