Thursday, March 19, 2026
Homeఆంధ్ర ప్రదేశ్జగన్ అసెంబ్లీకి వెళ్లడమే వైసీపీ నాయకుల అతిపెద్ద కోరిక!

జగన్ అసెంబ్లీకి వెళ్లడమే వైసీపీ నాయకుల అతిపెద్ద కోరిక!

క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి చేసుకుంది. ఒక రాష్ట్రంలో అధికార ప్రభుత్వం ఎంత కీలకమో… ప్రతిపక్షం కూడా అంతే కీలకం. అయితే అధికారం కోల్పోయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి ఈ సమయం ఎంతో కీలకమైనది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే అధికారం కోల్పోయిన తర్వాత మరో ఐదు సంవత్సరాల తర్వాతనే ఎలక్షన్లు ఉంటాయి కాబట్టి ఈ మధ్యలో… ఆ ఐదు సంవత్సరాలు కూడా ప్రతిపక్ష హోదాలో ఉండి ప్రజల్లో మమేకమవుతూ వచ్చే ఎలక్షన్లలో గెలుపే లక్ష్యంగా ఆలోచనతో ఉండాలి. కాబట్టి ప్రజల్లో మనపై ఎలాంటి అభిప్రాయం ఉన్నది అనేది సర్వేల ద్వారా తేల్చుకోవాల్సిన సమయం ఏర్పడింది. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి నుండి అభిప్రాయం అనేది తెలుసుకోవడం చాలా అవసరం. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఏడాదిలోనే ఈ ఏడాది కాలంపై సర్వేలు చేయించుకుంటున్నది. కానీ ప్రతిపక్ష పార్టీ వైసీపీ విషయానికి వస్తే.. సర్వేల ఊసే లేదు.

కానీ వైసీపీకి పెద్దదిక్కు ఆ పార్టీకి ఉన్న సోషల్ మీడియా నే. ఎలాగో సొంత మీడియా సాక్షి ఉన్న నేపథ్యంలో వైసిపికి కొంత మేలు జరిగినా పూర్తిస్థాయిలో మాత్రం జరగదు. ఇక వైసీపీ సొంత మీడియా సాక్షి నుండి వస్తున్న సమాచారం ప్రకారం… వైసీపీలో ఉన్న నాయకులు అలాగే వైసిపి అభిమానంతో ఉన్న ప్రజలు కొన్ని కీలక అంశాలపై స్పందిస్తూ ఉన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి కచ్చితంగా అసెంబ్లీకి వెళ్లాలని చాలామంది వైసిపి నాయకులు కోరుకుంటున్నారు. ఏకంగా 65% మంది జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లాలని కోరుకుంటున్నట్లుగా తాజా సమాచారం ప్రకారం వాస్తవాలు బయటకు వచ్చాయి. అయితే దీనిని నమ్మడం కష్టమే అయినా కూడా పార్టీలో మాత్రం ప్రతిరోజు దీని మీద ఎక్కువగా చర్చ జరుగుతుందట. ప్రజల తరపున.. ప్రజల బాధలను అసెంబ్లీకి వెళ్లి చర్చించాలని చాలామంది అభిమానులు కోరుతున్నారు. జగన్ ఒక్కసారి అసెంబ్లీకి వెళితే కచ్చితంగా మళ్ళీ ప్రజల మద్దతు లభిస్తుందని చాలా మంది తమ యొక్క అభిప్రాయాలను వెల్లడి చేస్తున్నారు. కానీ జగన్ మాత్రం ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప… సభకు వచ్చేదే లేదు అని చెప్తున్నారు.

కాళేశ్వరం కమిషన్ ముందుకు కేసీఆర్, కోదండరాం ఆసక్తికర వ్యాఖ్యలు!

నా సినిమాలకు టికెట్ ధరలు పెంచను.. దిల్ రాజు సంచలన ప్రకటన

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments