తెలంగాణ

అసెంబ్లీకి తాగొచ్చి ఒర్లుతుండు.. కోమటిరెడ్డి ఇజ్జత్ తీసిన హరీష్ రావు

తెలంగాణ అసెంబ్లీ హాట్ హాట్‌గా సాగుతోంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య ఓ రేంజ్ లో డైలాగ్ వార్ సాగుతోంది. వింటర్ సెషన్ నాలుగోరోజు మంగళవారం అసెంబ్లీ దద్దరిల్లింది. ప్రశ్నోత్తరాల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావు మధ్య మాటలు పరిధులు దాటాయి. ఈ సందర్భంగా కోమటిరెడ్డిని ఉద్దేశించి హరీష్ రావు చేసిన కామెంట్లు తీవ్ర దుమారం రేపాయి. కాంగ్రెస్ సభ్యుల అభ్యంతరంతో హరీష్ రావు మాటలను రికార్డుల నుంచి తొలగించారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్.

Read More : ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలకు ప్రభుత్వమే కారణం: కేటీఆర్

ప్రశ్నోత్తరాల్లో మాట్లాడిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. హరీష్ రావును టార్గెట్ చేశారు. కమీషన్ల దొంగ అని ఆరోపించారు. ప్రతి పనిలోనూ హరీష్ రావు కమీషన్లు తీసుకున్నారని అన్నారు. మంత్రి కోమటిరెడ్డి ఆరోపణలకు కౌంటర్ ఇచ్చిన హరీష్ రావు.. రోడ్ల మీద కాదు అసెంబ్లీలోనూ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేయాలని స్పీకర్ కు సూచించారు. కొందరు సభ్యులు అసెంబ్లీకి తాగి వస్తున్నారని.. తాగిన మత్తులో ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా ఒర్లుతున్నారని హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు.

Read More : పట్నం సహా లగచెర్ల రైతులకు బెయిల్

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని తాగుబోతు అనే అర్ధం వచ్చేలా హరీష్ రావు చేసిన కామెంట్లు తీవ్ర దుమారం రేపాయి. కోమటిరెడ్డికి మద్దతుగా ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాగి ఫాంహౌజ్ లో పడుకున్న మామను గుర్తుచేసుకుని హరీష్ రావు చిల్లరగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మంత్రి శ్రీధర్ బాబు కూడా హరీష్ రావు వ్యాఖ్యలను ఖండించారు. కాంగ్రెస్ సభ్యుల సూచనతో హరీష్ రావు కామెంట్లను రికార్డుల నుంచి స్పీకర్ తొలగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button