వైరల్సినిమా

అఖండ -2 అప్డేట్ వచ్చేసింది… ఎందుకు ఆగిపోయిందంటే?

క్రైమ్ మిర్రర్,సినిమా న్యూస్:- బాలకృష్ణ మరియు బోయపాటి దర్శకత్వంలో నిర్మించినటువంటి అఖండ 2 చిత్రం.. ఇవాళ వరల్డ్ వైడ్ గా విడుదల కావాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాల ద్వారా వాయిదా పడిన విషయం తెలిసిందే. కొన్ని ఫైనాన్స్ మరియు లీగల్ ఇష్యులతో ఈ సినిమా వాయిదా పడిందని విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే సినీవర్గాలు ఈ విషయంపై ఒక స్పష్టతనిచ్చాయి. ఓ డిస్ట్రిబ్యూటర్ ఫైనాన్షిర్లకు ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకపోవడంతో ఆగిపోయినట్లుగా.. తాజాగా ఆ డిస్ట్రిబ్యూటర్ బకాయిలు అన్నీ కూడా ఇచ్చేందుకు సిద్ధమయ్యారు అని సినీ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు హీరో బాలకృష్ణ అలాగే డైరెక్టర్ బోయపాటి తమ రెమ్యునరేషన్ లో కొంత భాగం వదులుకున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. అఖండ 2 నిర్మాణ సంస్థ 14 రీల్స్ మాకు 28 కోట్లు ఇవ్వాల్సి ఉంది అని.. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా విడుదలను వెంటనే ఆపివేయాలని ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ కోర్టును ఆశ్రయించింది. ఈ సమస్య పరిష్కారం అయ్యేంతవరకు కూడా 14 రీల్స్ నిర్మించిన ఈ అఖండ 2 సినిమాను విడుదల చేయకూడదు అని కోర్టు ఆదేశించడం జరిగింది. దీంతోనే ఈ సినిమా ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా విడుదలవ్వాల్సిన నేపథ్యంలో వాయిదా వేయాల్సి వచ్చింది అని.. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని స్పష్టం చేశారు . కాగా ఇప్పటికే ఈ సినిమా టికెట్లు కొనుగోలు చేసిన అభిమానులు తీవ్ర నిరాశలో ఉండిపోయారు.

Read also : చేతకానోళ్లు కూడా రోహిత్, కోహ్లీల భవిష్యత్ గురించి మాట్లాడుతున్నారు : హర్భజన్ సింగ్

Read also : ఈ యుద్ధాలు ఇంతటితో ఆగాలి.. 8 ఆపాను.. ఇంకోటి బ్యాలెన్స్ ఉంది : ట్రంప్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button