
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్ :-
ప్రస్తుత కాలంలో చాలామంది యువత ఉద్యోగం, కెరీర్ అంటూ తీవ్ర ఒత్తిడికి గురవుతూ ఉన్న సందర్భాలు ప్రతిరోజు చూస్తూనే ఉన్నాము. అంతేకాకుండా ఈ ఒత్తిడి కారణంగానే ఎంతోమంది యువత ఆత్మహత్యలు చేసుకుంటున్న సందర్భాలు కూడా నిత్యం సోషల్ మీడియాలో వింటూనే ఉన్నాము. తాజాగా ఇదే ఉద్యోగం, కెరీర్ ఒత్తిడి కారణంగా ముందుకు వెళ్లలేక పోతున్నాను అంటూ ఒక యువత అర్ధరాత్రి పూట తన తండ్రికి కాల్ ఫోన్ చేసి ఏడ్చేసిన సందర్భం సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరిని కలిచి వేస్తుంది. ఎంత చదివినా ఉద్యోగం రావట్లేదు అంటూ… నా కెరీర్ ఏమవుతుందో అని ఆ 22 ఏళ్ల అమ్మాయి తన తండ్రికి ఏడ్చుకుంటూ చెప్పుకుంటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో.. తన కూతురిని తండ్రి ఓదార్చిన తీరు ప్రతి ఒక్క నేటిజనుల హృదయాలను హత్తుకుంటుంది. అలాంటి సందేహాలు ఏమీ వద్దు.. నేను ఉన్న కదా నాన్న అంటూ… ఈ జాబ్ కాకపోతే ఇంకో జాబు.. దేశంలో ఎన్నో జాబ్స్ ఉన్నాయంటూ.. నువ్వు ఎక్కువగా టెన్షన్ తీసుకోకు అని చాలా ప్రేమగా మాట్లాడి తన కూతురి మనసుకు ధైర్యాన్ని నింపారు. ఏ పరిస్థితుల్లోనైనా ధైర్యంగా ఉండాలని తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. పిల్లలు కష్టాల్లో, ఉంటే ఏ తండ్రి అయిన ఇలానే ధైర్యం ఇస్తారు అని కామెంట్లు చేస్తున్నారు. కాబట్టి జీవితమంటే ఉద్యోగం కాదు అని.. ఇలాంటి చిన్న విషయాలకు ఆత్మహత్యలు సరికాదు అని చాలామంది యువతకు సందేశాలు ఇస్తున్నారు.
Read also : టాస్ ఓడిన భారత్.. ఇరు తుది జుట్లు ఇవే!
Read also : Crime: తల్లితో వివాహేతర సంబంధం పెట్టుకొని.. బిడ్డను గర్భవతి చేశాడు.. చివరికి





