
క్రైమ్ మిర్రర్, పొలిటికల్ బ్యూరో :- కల్వకుంట కవిత… మళ్లీ సొంత పార్టీ నేతలపై బాణం ఎక్కుపెట్టారు. ఈ సారి.. నల్గొండ నేతకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఆయన్ను లల్లీపుట్‌తో పోల్చారామె. పనిలో పనిగా బీఆర్‌ఎస్ బడా లీడర్లను ఉతికారేశారు. ఇంతకీ కవిత చెప్పిన ఆ లల్లీపుట్ లీడర్ ఎవరు…? కవిత కామెంట్లకు బీఆర్‌ఎస్ కౌంటర్ ఎలా ఉండబోతోంది…?
కేసీఆర్ కుమార్తు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత… మళ్లీ బీఆర్‌ఎస్ నేతలను టార్గెట్ చేశారు. ముఖ్యంగా మాజీ మంత్రి జగదీష్‌రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారామె. ఆయన పేరు ఎత్తకుండా.. లిల్లీపుట్ లీడర్ అంటూ ఎద్దేవా చేశారు. పార్టీలోని ఆ లిల్లీపుట్… తనను అవమానపరిచేలా నోటికొచ్చినట్టు ధూషించాడని.. అయినా బీఆర్‌ఎస్‌లోని బడా నాయకుడు ఖండించలేదన్నారు కవిత. ఇంటి ఆడపడుచుపై దారుణంగా మాట్లాడినా మౌనంగా ఉండిపోయారని అన్నారు. అంటే.. ఆయన వ్యాఖ్యల వెనుక పార్టీలోని పెద్ద నాయకుడి పాత్ర ఉందని ఆరోపించారు కవిత. అందుకే… లిల్లీపుట్‌ను కంట్రోల్ చేయలేదన్నారు. ఆ లిల్లీపుట్ తనపై విమర్శలు చేయగానే.. పార్టీలోని పిల్ల లీడర్లంతా.. తనపై ఇష్టమొచ్చినట్టు కామెంట్స్ చేస్తున్నారని మండిపడ్డారు.
Read also : కొడాలిని వదలని కూటమి – మరో కేసు – త్వరలోనే అరెస్ట్..?
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కవితపై విమర్శలు చేశారు మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి. కవిత గురించి ప్రశ్నించగా… ఆమె గురించి మాట్లాడేందుకు ఏమీ లేదని అన్నారు. అంతేకాదు.. ఆమెను బీఆర్‌ఎస్ పార్టీలో ఎవరూ పెద్దగా పట్టించుకోరని… ఆమెకు అంత వ్యాల్యూ లేదని అన్నారు. ఆమె పార్టీలో ఉంటే ఒక ఎమ్మెల్సీ.. పార్టీలో నుంచి బయటకు వెళ్తే.. ఆమెకు విలువే లేదని అన్నారు. ఆ వ్యాఖ్యలకు కవిత ఇప్పుడు కౌంటర్ ఇచ్చారు. తనను అనేంత స్థాయి… ఆ లిల్లీపుట్ నాయకుడికి లేదన్నారు. నల్గొండ జిల్లాలో పార్టీని గెలిపించుకోలేకపోయిన ఆయన… నాపై నోటికొచ్చినట్టు మాట్లాడుతాడా అంటూ మండిపడ్డారు.
Read also : కాళేశ్వరం కమిషన్ నివేదికకు కేబినెట్ ఆమోదం
కవిత వ్యాఖ్యలు బీఆర్‌ఎస్‌లో మళ్లీ వేడి రాజేశాయి. మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి వెంటనే… ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్‌లు వెళ్లారు. కవిత వ్యాఖ్యలపై ఆయన మాట్లాడినట్టు సమాచారం. అయితే… కేసీఆర్ మౌనంగా ఉండాలని… చెప్పినట్టు తెలుస్తోంది.