జాతీయం

పుష్ప 2 సినిమా దెబ్బకి తెలంగాణలో బెనిఫిట్ షోలు బంద్

పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో ఓ మహిళ మృతి చెందడం ఆమె కుమారుడు తీవ్ర అస్వస్థ తకు గురై ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత సంధ్య థియేటర్ యాజ మాన్యంపై సినిమా హీరో అల్లు అర్జున్ పై కేసు నమోదైంది. ఈ విషయం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ఇందులో భాగంగా రాష్ట్రంలో బెనిఫిట్ షోలను రద్దు చేస్తున్నట్టు రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరె డ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. అలాగే పుష్ప2 ప్రీమియర్స్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి చెందిన విషయం తెలిసిన తర్వాత చాలా బాధ కలిగిందని అన్నాడు.. అలాగే మహిళ కుటుంబానికి సానుభూతి తెలియజేశాడు. అలాగే సంధ్య థియేటర్ ఘటనకి కారణమైన వారిని కచ్చితంగా కఠినంగా శికిస్తామని తెలిపారు.

అయితే పుష్ప 2 ప్రీమియర్ షో చూడటానికి హైదరాబాద్ దిల్షుక్ నగర్ కి చెందిన రేవతి అనే మహిళ తన భర్త పిల్లలతో సంధ్య థియేటర్ కి వచ్చింది. ఇదే సమయంలో అల్లు అర్జున్ కూడా తన ఫ్రెండ్స్, ఫ్యామిలీతో వచ్చాడు. దీంతో ఫ్యాన్స్ ఎక్కువగా రావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో రేవతి కిందపడి మరణించింది.

బాలుడు శ్రీ తేజ తీవ్ర అస్వస్థతకి గురి కాగా స్థానికులు దగ్గరలో ఉన్న హాస్పిటల్ లో చేర్పించారు. ఈ సంఘటన అనంతరం హైదరాబాద్ లోని చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ టీమ్, సంధ్య థియేటర్ యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు.

మరిన్ని వార్తలు చదవండి…

‘ప్రపంచ ధ్యాన దినోత్సవం’.. ప్రకటించిన కేంద్రం!

ఆడికి ఆడి కొడుక్కి ఆడి తమ్ముడికి కూడా నేనె బాస్.. పుష్ప మెగా ఫైర్

శివరాజ్ కుమార్ కు క్యాన్సర్!…తన ఆస్తి అంత ఏం చేస్తున్నాడో తెలుసా..?

వైరల్ అవుతున్న కీర్తి సురేష్ వెడ్డింగ్ కార్డు..

భూకంపం దెబ్బకి ఊగిపోయిన సమ్మక్క, సారక్క ఆలయం!

కోమటిరెడ్డి ఎఫెక్ట్.. రీజనల్ రింగ్ రోడ్డుకు అటవీ అనుమతులు

తెలుగు రాష్ట్రాల్లో భూకంపం.. భయంతో పరుగులు పెట్టిన జనం

బన్నీ కోసం రంగంలోకి పవన్.. సంబరాల్లో మెగా ఫ్యాన్స్ 

జీ న్యూస్ రిపోర్టర్‌పై జనసేన ఎమ్మెల్యే హత్యాయత్నం!.. పవన్ సీరియస్

అల్లు అర్జున్ పై సెటైరికల్ ట్వీట్ చేసిన ఆంధ్ర ఎంపీ?… అసలు ఏమైందో తెలుసా?

కుండపోత వానలు.. స్కూళ్లు, కాలేజీలకు సెలవు

డిసెంబర్ 3న టీడీపీలోకి తీగల.. ఆయనతోనే ఆకుల అర్వింద్ కుమార్

జనవరిలో సర్పంచ్ ఎన్నికలు.. ముగ్గురు పిల్లల్లున్నా పోటీ చేయొచ్చు

నాగబాబుకి కీలక పదవి…ఢిల్లీ వెళ్ళిన పవన్ కళ్యాణ్?

అయ్యప్ప స్వాములకు బ్రీత్ అనలైజర్ టెస్ట్.. ఆర్టీసీలో దుమారం 

ఫుడ్ పాయిజన్‌తో 38 మంది విద్యార్థులు మృతి.. తెలంగాణలో ఘోరం 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button