క్రీడలు

టెస్ట్ క్రికెట్ మజాని ఇస్తుంది… ఆఖరి టెస్ట్ లో విజయం సాధించి డ్రాగ ముగిస్తాం : కెప్టెన్ గిల్

క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:- ఇండియా మరియు ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న అండర్సన్- టెండూల్కర్ టెస్ట్ సిరీస్ లలో భాగంగా ఇప్పటివరకు 4 మ్యాచులు ముగిసాయి. ఇందులో ఇంగ్లాండ్ రెండు టెస్ట్ మ్యాచ్లు గెలవగా ఇండియా కేవలం ఒకటి మాత్రమే గెలిచింది. ఫోర్త్ టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ ఫోర్త్ టెస్ట్ మ్యాచ్లో ఇండియా ఓటమి తప్పదు అనుకున్న సమయంలో జిడిజా అలాగే సుందర్ ఇద్దరూ కూడా అద్భుతమైన బ్యాటింగ్ చేసి… విరోచిత శతకాలతో జట్టును ముందుకు నడిపించారు. ఒక విధంగా నాలుగో టెస్ట్ మ్యాచ్లో డ్రాగా ముగియడానికి గల కారణం వీరిద్దర అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే తాజాగా టీమిండియా కెప్టెన్ గిల్ నాలుగో టెస్ట్ మ్యాచ్ పై అలాగే ఐదవ టెస్ట్ మ్యాచ్ పై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.
మానవత్వానికి మచ్చ: అక్రమ సంబంధం కోసం బస్టాండ్‌లో పేగుబిడ్డను వదిలేసిన తల్లి
టీమిండియా ఆల్రౌండర్స్ జడేజా అలాగే వాషింగ్టన్ సుందర్ ఇద్దరు కూడా అద్భుతమైన బ్యాటింగ్ చేసి టీమిండియా ఓడిపోకుండా చేశారని కెప్టెన్ గిల్ కొనియాడారు. అయితే వీళ్ళిద్దరూ కూడా 90 పరుగుల వద్ద ఉన్నప్పుడు డ్రాకు వెళ్దామని… కొందరు అనడంతో నేను వెంటనే ఎందుకు ఒప్పుకోవాలి అని అన్నాను అని అన్నారు. వీళ్ళిద్దరూ సెంచరీలు చేసేందుకు పూర్తిగా అర్హులు అని అన్నారు. ఈ టెస్ట్ సిరీస్ ను యావత్తు ఇండియా అభిమానులు అందరూ కూడా మజాను పొందుతున్నారని… కెప్టెన్ గిల్ అన్నారు. కచ్చితంగా చివరి టెస్టులో విజయం సాధించి.. ఈ సిరీస్ ను డ్రాగ ముగిస్తామని గిల్ ధీమా వ్యక్తం చేశారు.
కన్న కొడుకు చేతిలో వృద్ధ తల్లిదండ్రుల కన్నీటి గాధ.!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button