
క్రైమ్ మిర్రర్, అంతర్జాతీయ న్యూస్ :- టెస్లా అనే పేరు వినగానే ప్రతి ఒక్కరికి కూడా ఆ కంపెనీ సీఈఓ అయినటువంటి ఎలాన్ మస్క్ గుర్తుకు వస్తారు. అసాధ్యాలను కూడా సుసాధ్యం చేసేటువంటి ఈ టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ తాజాగా జరిగిన ఓ పాడ్ కాస్ట్ లో భాగంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తమ టెస్లా కంపెనీ నుంచి త్వరలోనే గాల్లో ఎగిరేటువంటి కార్లను తెస్తున్నట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి మరికొన్ని వివరాలను కూడా ఈ పాడ్ కాస్ట్ లో వివరించారు. ఈ ఏడాది లోనే దీనికి సంబంధించినటువంటి ప్రోటో టైప్ ను ప్రదర్శిస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ పాడ్ కాస్ట్ లో ఇంటర్వ్యూర్ మీరు గాల్లో ఎగరవేసేటువంటి కారుకు రెక్కలు ఉంటాయా?.. లేక హెలికాప్టర్ల లా గాల్లో ఎగురుతుందా?.. అని ఎలాన్ మస్క్ ను ప్రశ్నించగా.. అతను ఈ విషయానికి మాత్రం సమాధానం ఇవ్వలేదు అని సమాచారం. మా ఆవిష్కరణలు ఎవరి ఊహలకు కూడా అందని విధంగా ఉంటాయని… ఈ ఫ్లయింగ్ కారు కూడా ఎవరు ఊహించని విధంగా ఉంటుంది అని ఎలాన్ మస్క్ స్పష్టం చేశారు. అయితే మస్క్ తెలిపినటువంటి ఈ గాల్లో ఎగిరే కార్ గురించి అది అసాధ్యం అంటూ.. ఫెయిల్ అవుతుంది అని కొంతమంది కామెంట్ చేస్తుండగా మరి కొందరు మాత్రం ఎందుకు సాధ్యం కాదు అని ఎల్లన్ మస్కుకు సపోర్టుగా నిలుస్తున్నారు. కాగా టెస్ట్లా కంపెనీ నుంచి వచ్చినటువంటి కార్లు కూడా ఎంతో బ్రాండ్ ను కలిగి ఉన్నాయి.
Read also : “బాహుబలి ది ఎపిక్” ఫస్ట్ డేనే కలెక్షన్ల జోరు..!
Read also : జోగి రమేష్ అరెస్టుపై వైసీపీ ఆగ్రహం





