అంతర్జాతీయంజాతీయం

ముంబైలో టెస్లా షోరూం… ధర తెలిస్తే షాక్ అవుతారు?

క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్ :- నిత్యం సోషల్ మీడియాలో నిలిచే ఎలాన్ మస్క్.. తాజాగా తన ఈవీ కార్ల తయారీ సంస్థ టెస్లాను భారత్లో షో రూమ్లను సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 15వ తారీఖున ముంబైలో టెస్లా తొలి షో రూమ్ను ప్రారంభించినట్లు తెలుస్తుంది. ముంబైలోని బాంద్రాలో ఎలాన్ మస్క్ తన తొలి షో రూమ్ ను ప్రారంభిస్తున్నారు. కాగా ఇప్పటికే ఈ టెస్లా కార్లు ముంబైకి కూడా చేరుకున్నాయని జాతీయ మీడియా సంస్థ పేర్కొంది. ఇక 2021 నుంచే టెస్లా భారత్ మార్కెట్లో ప్రవేశించాలని చెప్పేసి ఎన్నో శత విధాలుగా ప్రయత్నించినా కూడా కంపెనీ ఏర్పాటు చేయాలన్న భారత్ కండిషన్లతో చాలా ఆలస్యం అవుతూ వచ్చింది. కానీ ఇప్పుడు ఇండియాలోని పలు ముఖ్య నగరాలలో తన షోరూమ్లను ప్రారంభిస్తారని సమాచారం అందింది.

అయితే ప్రపంచంలోనే కాకుండా ఇండియాలో కూడా ఈ టెస్లా కారును చాలా మంది ఇష్టపడుతున్నారు. ఈనెల 15వ తారీఖున టెస్ట్ల ఎలక్ట్రిక్ కార్ల షోరూం ప్రారంభమవుతున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసింది. దీంతో వై మోడల్ కారు ధర ఎంత ఉంటుందనేది ఏ ఒక్కరూ కూడా అంచనా వేయలేకపోతున్నారు. అయితే ఈ Y మోడల్ కారు దొర ప్రస్తుతం 27.70 లక్షలు గా ఉంది. ఇక ఇది మన దేశానికి రాగానే ఏకంగా 70% దిగుమతి ఫీజు విధిస్తారు. అప్పుడు సుమారుగా మొత్తం కలిపి ఈ కారు ధర 48 లక్షలు. మళ్లీ రోడ్ టాక్స్ లని ఇన్సూరెన్స్ అదనంగా చెల్లించాల్సి అని ఇలా ఎన్నో ఉంటాయి. కాబట్టి అన్ని ధరలు కలుపుకొని కనీసం 50 లక్షలు ఉంటుందని ఫైనల్ రేట్ ఫిక్స్ చేశారు. ఈ కార్లను టెస్లా కంపెనీ చైనా నుంచి దిగుమతి చేసుకొని ఇండియాలో అమ్మకానికి పెట్టనుంది. దీంతో మొట్టమొదటిసారిగా వచ్చినటువంటి కార్లు అనుకునేందుకు చాలా మంది ఇండియన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ఇజ్రాయెల్ తాత్కాలిక కాల్పుల విరణమ, నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు!

వరుసగా రెండో రోజు.. ఢిల్లీని వణికించిన భూ ప్రకంపనలు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button