
హైదరాబాద్‌ను ఉగ్రవాదులు టార్గెట్ చేశారా…? పేలుళ్లకు ప్లాన్ చేశారా..? అవును. ముష్కర మూక నగరంలో అడుగుపెట్టింది. పేలుళ్లతో మరోసారి అలజడి సృష్టించాలని చూసింది. కానీ.. భద్రత దళాల డేగ కన్ను.. వారి కుట్రను పసిగట్టేసింది.
పెహల్గామ్‌లో టెర్రర్ అటాక్… ప్రతికారంగా పాకిస్తాన్‌లోని ఉగ్రస్థావరాలపై ఆపరేషన్ సిందూర్.. ఆ తర్వాత.. భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతులు అన్నీ టెన్షన్ పెట్టాయ్. ఆ తర్వాత.. రెండు దేశాలు సీజ్ ఫైర్‌కు ఒప్పకోవడంతో.. ఇప్పుడు అంతా ప్రశాంతంగా ఉంది. ఇంతలో హైదరాబాద్‌లో అలజడి రేగింది. నగరంలో ఉగ్రకదలికలు గుండె ఝల్లుమనిపించాయి. కానీ వారి కుట్ర పోలీసులు భగ్నం లేదు. దీంతో.. పెద్ద ప్రమాదం తప్పింది.
ఐసీస్ ఆదేశాలతో సౌదీ నుంచి హైదరాబాద్ వచ్చిన ఇద్దరు ఉగ్రవాదులు… నగరంలో విధ్వంసం సృష్టించేందుకు స్కెచ్ వేశారు. పేలుళ్ల కోసం కావాల్సి సామగ్రి మొత్తం సిద్ధం చేసుకున్నారు. ఆలస్యం అయ్యింటే.. అన్నంత పని చేసేవారేమో. కానీ.. వారి కదలికలను కనిపెట్టిన ఇంటెలిజెన్స్ అధికారులు ఇద్దరు ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. పేలుళ్ల కుట్రకు చెక్ పెట్టారు. దీంతో.. హైదరాబాద్‌కు ఉగ్రముప్పు తప్పింది.
ఇద్దరు ఉగ్రవాదులు సిరాజ్, సమీర్‌గా గుర్తించారు. ఇద్దరిలో ఒకడు హైదరాబాద్‌కు చెందిన వాడే. మరో ఉగ్రవాది విజయనగరానికి చెందిన వాడని పోలీసులు తెలిపారు. విజయవాడలో పేలుడు పదార్థాలు కొని.. హైదరాబాద్‌లో బ్లాస్టింగ్ చేయాలన్నదే వారి స్కెచ్. ప్రస్తుతం వీరిద్దరూ పోలీసుల అదుపులో ఉన్నారు. వీరు టెర్రరిస్టులుగా ఎలా మారారు..? ఏయే ఉగ్రసంస్థలతో సంబంధాలు ఉన్నాయి..? హైదరాబాద్ టార్గెట్‌గా పేలుళ్లు జరపమని వీరికి ఆదేశాలు ఇచ్చింది ఎవరు..? అన్న విషయాలపై ఆరా తీస్తున్నారు. ఉగ్రవాదులు ఇద్దరూ తెలుగువారు కావడం ఆందోళన కలిగిస్తోంది.