
అదిగో… ఇదిగో అన్నారు. కానీ… ఇప్పటి వరకు తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడిని ప్రకటించలేదు. ఇంతలో పహల్గామ్ ఉగ్రదాడి.. ఫోకస్ అంతా అటు మళ్లింది. దీంతో… టీబీజేపీ చీఫ్ ఎంపిక మరింత ఆలస్యమవుతోంది. ఈ పరిస్థితి… పార్టీ క్యాడర్‌లో అసహనం పెంచుతోంది. ఇంకెప్పుడు ప్రకటిస్తారన్న చికాకు కూడా కలుగుతోంది.
తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడి నియామకం అవసరం. ఎందుకంటే… త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. దానికి తగ్గ కార్యాచరణ రూపొందించుకోవాల్సి ఉంది. పార్టీని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డి ఉన్నా…. త్వరలోనే కొత్త అధ్యక్షుడి ఎంపిక ఉంటుంది కనుక… ఆయన భవిష్యత్ కార్యక్రమాలను పెద్దగా పట్టించుకోని పరిస్థితి ఉంది. కొత్తగా వచ్చే అధ్యక్షుడే అన్నీ చూసుకుంటారన్న అభిప్రాయమూ ఉంది. దీంతో… తెలంగాణ బీజేపీ కొత్త కార్యక్రమాలు, కార్యాచరణలు చేపట్టడంలేదు. ఈ పరిస్థితి రాష్ట్రంలో బీజేపీకి నష్టం కలిగించే అవకాశాలు ఎక్కువ. కనుక వీలైనంత త్వరగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక జరిగితే మంచిదన్న ఆలోచన ఉంది.
Also Read : అచ్చెన్నాయుడి రాజకీయ భవిష్యత్ ఏంటి..? – ఆయన తప్పుకుని వారసుడిని దింపుతారా..!
అయితే… తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎంపికకు పోటీ ఉండటంతో… నేతల్లో భిన్నాభిప్రాయాలు ఉండటంతో…. అధిష్టానం పలు దఫాలుగా చర్చలు జరిపింది. త్వరలోనే టీబీజేపీ సారధిని నియమించాలని అనుకునే లోపు.. పహల్గామ్‌లో ఉగ్రదాడి జరిగింది. దీంతో… బీజేపీ అధిష్టానం మొత్తం ఫోకస్ ఆవైపు పెట్టింది. దీంతో… తెలంగాణలో మాత్రమే కాదు ఏపీ సహా పలు రాష్ట్రాల్లో అధ్యక్షుల నియామకం ఆగింది. ఉగ్రదాడి అంశం కొలిక్కివచ్చాకే… రాష్ట్ర అధ్యక్షుల నియామకం చేపడితే… రాజకీయంగా ఆయా రాష్ట్రాల్లో సమస్యలు వస్తాయని పార్టీ కేడర్ భావిస్తోంది. ముఖ్యంగా తెలంగాణలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ మెరుగైన ఫలితాలు సాధించే అవకాశాలు తగ్గుతాయి. కనుక… రాష్ట్ర అధ్యక్షుల నియామకం వేగంగా జరగాలని… బీజేపీ నేతలు, కార్యకర్తలు కోరుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి ..
-
కేటీఆర్ త్వరగా కోలుకోవాలని అంటున్న… లోకేష్, పవన్ కళ్యాణ్
-
నర్సాపూర్ లొ కింగ్ ఫిషర్ బీర్ల కృతిమ కొరత..బెల్టు షాపుల్లో ఫుల్ స్టాక్..! వైన్ షాపుల్లో నో స్టాక్.
-
తెలంగాణ ఇచ్చింది సోనియా కాదు… వాస్తవం బయటపెట్టిన జగ్గారెడ్డి
-
కేబినెట్ విస్తరణపై నిర్ణయం రేవంత్ రెడ్డిదే – పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన అధిష్టానం
-
బిగ్ బ్రేకింగ్.. థర్మల్ పవర్ ప్లాంట్ లో భారీ అగ్నిప్రమాదం..