
సంస్థాన్ నారాయణపూర్, మార్చి 29(క్రైమ్ మిర్రర్): యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపూర్ మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించి స్వీట్లు పంపిణీ చేసినారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ మండల నాయకులు కుందారపు యాదయ్య జెండా ఆవిష్కరణ చేసి అనంతరం మాట్లాడుతూ కీర్తిశేషులు నందమూరి తారక రామారావు పార్టీని స్థాపించి తొమ్మిది నెలల్లో అధికారంలోకి తెచ్చి, బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారము కల్పించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని తెలిపారు.
పటేలు, పట్వారి వ్యవస్థను రద్దుచేసి ప్రజల వద్దకు ప్రభుత్వాన్ని తీసుకువచ్చి, రెండు రూపాయలకు కిలో బియ్యం, రైతులకు 50 రూపాయలకే హార్స్ పవర్ విద్యుత్తు కల్పించి ఎన్నో సంస్కరణలు తెచ్చి నూతన వరవడిని సృష్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీపతి రామ్ రెడ్డి, కొలను వేణుగోపాల్ రెడ్డి, గుమ్మడి అంజిరెడ్డి, తుమ్మల శేఖర్ రెడ్డి, భగవంత్, కుకుడాల గోవర్ధన్ రెడ్డి, మంగ నరసింహ, బొల్లం జగదీష్, ఊరచిన్న, కొర్ల సత్తిరెడ్డి, చిలువేరు లక్ష్మణ్, ముత్యాల బిక్షపతి, ముత్యాల నరసింహ, జనగాం కిష్టయ్య, రాజారాం, బొడిగ నరసింహ, శంకరయ్య, ముగుదాల రాములు, నీళ్ల లవయ్య, తదితరులు పాల్గొన్నారు.