
క్రైమ్ మిర్రర్, ఆంధ్ర ప్రదేశ్ :- సినిమాలతో, యాంకరింగ్ తో అందరినీ కూడా అలరించే అనసూయ తాజాగా ప్రకాశం జిల్లాలోని మార్కాపురం పట్టణంలో ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. షాపింగ్ మాల్ ప్రారంభించడానికి వచ్చిన అనసూయకు చేదు అనుభవం ఎదురయింది. షాపింగ్ మాల్ ప్రారంభించిన అనంతరం ఆమె అక్కడి ప్రజలతో మాట్లాడుతూ ఉన్న సందర్భంలో కొంతమంది యువకులు అనసూయ పై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీంతో వెంటనే ఆగ్రహానికి గురైన అనసూయ.. “చెప్పు తెగుద్ది” అని.. అక్కడ ఉన్నటువంటి పోకిరిలను తిట్టారు. మీ ఇంట్లో మీ అమ్మ, మీ చెల్లి, మీ గర్ల్ ఫ్రెండ్ లేదా మీ కాబోయే భార్యను ఇలాగే ఏడిపిస్తే మీరు ఊరుకుంటారా?.. అని ఆ యువకులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తిని తిరగడమే కాకుండా… ఇప్పుడు ఇలాంటివి కూడా నేర్చేసుకున్నారా? అని మండిపడ్డారు. చిన్నప్పటినుంచి పెద్ద వాళ్ళు మీకు ఎవరితో ఎలా ఉండాలో?.. ఎలా గౌరవించాలో అనేది నేర్పలేదా అని కొంతమంది ఆకతాయిలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read aslso : తగ్గిన బంగారం, వెండి ధరలు.. తులం ధర ఎంతంటే?
గతంలో అనసూయ ప్రకాశం జిల్లాలో లేదా ఎక్కడికైనా బయటికి వెళ్లి షాపింగ్ మాల్స్ ఓపెన్ చేసిన సందర్భంలో ఇలాంటి వ్యాఖ్యలు ఎప్పుడూ చేయలేదు. అయితే ఒక్కసారిగా ఆగ్రహించి అనసూయ కొంతమంది పోకిరిలపై ఇలా అనడం ఇదే మొదటిసారి. కానీ అనసూయ మాట్లాడిన మాటలు గురించి చాలా మంది చర్చిస్తున్నారు. అనసూయ అలా మాట్లాడడం మంచిదే అని కొంతమంది.. ఎలా పడితే అలా మాట్లాడకూడదని మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది మాత్రం అనసూయకు అమ్మోరు పూనింది అని… ఇక భవిష్యత్తులో ఎప్పుడు కూడా తప్పుగా ప్రవర్తించకూడదని చాలా మంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. కాగా అనసూయ ప్రతి సంవత్సరం కూడా ప్రకాశం జిల్లాలో ఏదో ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి వస్తూనే ఉంటారు. కానీ ఎప్పుడు కూడా ఇలాంటి వింత అనుభూతి పొందలేదు.
Read also : తల్లిదండ్రులకు డిఫర్మేషన్ సూట్ పంపిన కొడుకు అరాచకం..!