
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ పెంచేలా గ్లోబల్ సమ్మిట్ జరగాలి అని ఆదేశించారు. వచ్చే డిసెంబర్ నెల 8 మరియు 9వ తేదీలలో ఫ్యూచర్ సిటీలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్ కు దాదాపు 2000 మంది ప్రముఖులు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఇందులో భాగంగానే “TG రైజింగ్ 2047 డాక్యుమెంట్” ను రూపొందించి.. ఇందులో రాష్ట్రం యొక్క లక్ష్యాలు, ప్రణాళికలను పూర్తిగా వివరించేలా ఆవిష్కరించనుంది. ఈ సమ్మిట్ ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువ కొనసాగుతుంది అని.. రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ పెంచడమే కాకుండా భారీ పెట్టుబడులను ఆకర్షించి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే దీని లక్ష్యం అని పేర్కొన్నారు. ఈనెల 25వ తేదీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి వివిధ శాఖల తో సమీక్షించిన తర్వాత ఈ TG రైజింగ్ 2047 డాక్యుమెంట్ కు తుది మెరుగులు దిద్దనున్నారు. వచ్చే నెల 8 మరియు 9 తేదీలలో ఈ గ్లోబల్ సబ్మిట్ జరుగుతుంది.
Read also : మహిళలను కోటీశ్వరులు చేయడమే ప్రభుత్వ లక్ష్యం : MLA కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Read also : Sex Awareness: పీరియడ్స్ టైమ్‌లో శృంగారంలో పాల్గొనవచ్చా?





