HomeజాతీయంIndia–Pak Border: పాక్‌ బార్డర్ లో తెలంగాణ యువకుడి అరెస్ట్, ఇంతకీ అక్కడికి ఎందుకు వెళ్లినట్టు?

India–Pak Border: పాక్‌ బార్డర్ లో తెలంగాణ యువకుడి అరెస్ట్, ఇంతకీ అక్కడికి ఎందుకు వెళ్లినట్టు?

  • రాజస్థాన్ సరిహద్దు ప్రాంతంలో తెలంగాణ యువకుడి అరెస్ట్
  • అష్ఫక్‌ హుస్సేన్‌(38)గా గుర్తించిన BSF అధికారులు
  • అష్ఫక్‌ దగ్గర ఉన్న పాస్‌పోర్టును స్వాధీనం

భారత్-పాక్ సరిహద్దులో తెలంగాణాకు చెందిన యువకుడు అరెస్ట్ అయ్యాడు. అనుమానాస్పదంగా తిరుగుతున్న అతడిని BSF అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రాజస్థాన్‌ లోని భారత్‌-పాక్‌ సరిహద్దు ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా మంగళవారం ఉదయం అతడిని అరెస్ట్ చేశారు. అరెస్టయిన వ్యక్తిని తెలంగాణకు చెందిన అష్ఫక్‌ హుస్సేన్‌(38)గా గుర్తించినట్టు సమాచారం.

Read Also: బ్యాంకు ఉద్యోగి బరితెగింపు, లాకర్ల నుంచి కోట్ల విలువైన బంగారాన్ని కొట్టేసి..

ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?

భారత్‌-పాక్‌ సరిహద్దుల్లోని మైజలార్‌ ప్రాంతంలోని గుంజల్‌ ఘడ్‌ లో ఆర్మీ ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఆ ప్రాంతంలో అష్పక్ అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు పట్టుకున్నారు. వారు BSFకు సమాచారం అందించారు. పట్టుబడిన వ్యక్తి తెలంగాణకు చెందిన అష్ఫక్‌ హుస్సేన్‌గా గుర్తించారు. అష్ఫక్‌ వద్ద భారతీయ పాస్‌ పోర్టును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై BSF అధికారులతో పాటు నిఘా వర్గాలు దర్యాప్తు చేపట్టాయి. తెలంగాణ నుంచి జైసల్మేర్‌ సరిహద్దుకు ఎందుకు వచ్చాడు? స్థానికంగా ఎవరినైనా కలిసేందుకు వచ్చాడా? అనే కోణంలో బీఎస్‌ఎఫ్‌, ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీలు దర్యాప్తు చేపట్టాయి. త్వరలోనే అసలు నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Read Also: రష్యా ఆయిల్ కొనుగోళ్లను భారత్ నిలిపివేస్తుందా? మంత్రి జైశంకర్ ఏం చెప్పారంటే?

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను. 2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.

Most Popular

Recent Comments