తెలంగాణ

తెలంగాణ టెట్‌ ఫలితాలు విడుదల

  • 33.98శాతం అభ్యర్థుల ఉత్తీర్ణత

  • మొత్తం 30,649 మంది క్వాలిఫై

  • విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా

క్రైమ్‌మిర్రర్‌, హైదరాబాద్: తెలంగాణలో టెట్‌ ఫలితాలు రిలీజయ్యాయి. 33.98శాతం అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. ఫలితాలను విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా నేరుగా ఆన్‌లైన్‌లో రిజల్ట్స్‌ విడుదల చేశారు. జూన్‌ 18 నుంచి 30వరకు నిర్వహించిన ఈ పరీక్షకు ఒక లక్ష 37వేల 429 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో 30,649మంది క్వాలిఫై అయినట్లు విద్యాశాఖ వెల్లడించింది.

ఏడు భాషల్లో పేపర్‌ 1, 2 పరీక్షలను నిర్వహించారు. పేపర్‌-1కు 47,224 మంది అభ్యర్థులు హాజరుకాగా, 29,043మంది ఉత్తీర్ణత సాధించారు. పేపర్‌-2కి 48,998మంది హాజరుకాగా, 15,574మంది పాసయ్యారు. పేపర్‌-2లోని సోషల్‌ స్టడీస్‌లో 41,207మంది పరీక్షకు హాజరుకాగా, 13,075మంది ఉత్తీర్ణత సాధించారు. http://tgtet.aptonline.in/tgtet/ResultFront వెబ్‌సైట్‌లో ఫలితాలను చూసుకోవచ్చని అధికారులు తెలిపారు.

 

Read Also: 

  1. కాంగ్రెస్‌ కార్యాలయాల్లా పోలీస్‌స్టేషన్లు!… ఆర్మూర్‌ పీఎస్‌లో హస్తం పార్టీ నేతల ప్రెస్‌మీట్‌
  2. ఏపీ మహిళలకు శుభవార్త… ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button