
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్:- ప్రజల చేతుల్లో చెప్పు దెబ్బలకు కాంగ్రెస్ సిద్ధమా..? అంటూ మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన అమరవీరుల బలిదానాలకు ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహమేనని ఆయన స్పష్టం చేశారు. నీటి హక్కులు, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, స్థానిక నిరుద్యోగులకు ఉద్యోగాల విషయంలో జరిగిన అన్యాయం వెనుక కూడా కాంగ్రెస్ చేతి ఉందని ఆయన ఆరోపించారు. ప్రజల ముందుకు రండి, చర్చించటానికి డేట్ ఫిక్స్ చేయండి. మేము ఆధారాలతో వస్తాం. కాంగ్రెస్ పాలనలో తెలంగాణకు జరిగిన నష్టాలను ఒక్కొక్కటిగా బయటపెడతాం అని జగదీష్ రెడ్డి సవాల్ విసిరారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ ద్రోహాలను ఎప్పటికీ క్షమించరని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ నాయకులు ప్రజా తీర్పుకు భయపడతారని ఆయన వ్యాఖ్యానించారు.
Read also : నేటికీ 47 ఏళ్ళు… చిరు స్పెషల్ ట్వీట్!
Read also : చౌటుప్పల్‌లో OG సినిమా ఫస్ట్ షో టికెట్ రికార్డు