జాతీయంతెలంగాణ

తెలంగాణ ఆర్టీసీ బస్ టికెట్ చార్జీల పెంపు...ప్రయాణికులకు షాకు?

భారతదేశంలోని రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా విజయదశమి శరన్నవరాత్రుల ఉత్సవాలు అనేవి ఘనంగా జరుగుతూ ఉన్నాయి. దసరా సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆర్టీసీ కొత్త నిర్ణయం తీసుకుంది. దసరాకి సెలవులు ఎక్కువగా ఉండడంతో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సొంత ఊర్లకు వెళ్లడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటప్పుడు ముఖ్యంగా వెతుక్కునే దారి బస్సులు. కాబట్టి తెలంగాణ ఆర్టీసీ అధికారులు ఒక నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా 6300 బస్సులను నడుపుతున్నారు. పండుగ సందర్భంగా రద్దీ ఎక్కువగా ఉంటుంది కనుక స్పెషల్గా ఈ బస్సులు నడుపుతున్నామని తెలంగాణ ప్రభుత్వం చెప్పుకొచ్చింది. కాబట్టి బస్సు చార్జీలు పెంచాల్సి వస్తుందని తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు.

ఈ బస్సులనేవి ఎక్కువగా పండగను దృష్టిలో పెట్టుకొని తీసుకువచ్చామని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఎందుకు ఇలా చార్జీలు పెంచారు అని అడగగా రిటర్న్ వచ్చేటప్పుడు బస్సులు ఖాళీగా వస్తుండడంతో ఈ రేట్లు అనేవి కొంచెం పెంచాల్సి వచ్చింది అని తెలంగాణ ఆర్టీసీ ఎండి సజ్జనార్ చెప్పుకొచ్చాడు. కాబట్టి ఈ పండుగను దృష్టిలో ఉంచుకొని ఎక్కువ మంది జనాలు వేరువేరు ఊర్లకు ప్రయాణించాల్సి ఉంటుంది కాబట్టి ప్రత్యేకమైనటువంటి ఇంచార్జీలు పెడుతున్నారు. అయితే ఈ విషయం నుండి సర్వత్రా అన్ని రంగాల ప్రజల నుండి కొంచెం విమర్శలు వస్తున్నాయి. ప్రజలను ఉద్దేశించి ఎక్కువ బస్సులు నడపడం మంచిదే కానీ రేట్లు కూడా తగ్గించి పెడితే ఇంకా బాగుండేదని అందరూ కూడా ఎక్కువ రేట్లని ఉద్దేశం లేకుండా హ్యాపీగా ప్రయాణం చేస్తారని కామెంట్లు కూడా చేస్తున్నారు. మరి ఎక్కువ బస్సులు నడపడం పై అలాగే ఎక్కువ ఛార్జీలు తీసుకోవడంపై మీ అభిప్రాయం ఏంటో తెలపండి.

One Comment

Back to top button