తెలంగాణ

“బీసీ సబ్ ప్లాన్” అమలు చేయాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ డిమాండ్

సంగారెడ్డి, క్రైమ్ మిర్రర్:- ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ తరహాలోనే వెనుకబడిన తరగతుల సమగ్ర అభివృద్ధి కోసం చట్టబద్ధమైన “బీసీ సబ్ ప్లాన్” అమలు చేయాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా బుధవారం తెలంగాణ రాజ్యధికార పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆదేశానుసారం తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లా, మండల కేంద్రాలలో అధికారులకు వినతిపత్రం సమర్పించారు. తెలంగాణ రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ఉన్న వెనుకబడిన తరగతుల సామాజిక, ఆర్థిక స్థితిగతులు మెరుగుపడాలంటే వారికి ప్రత్యేక బడ్జెట్ మరియు చట్టపరమైన రక్షణ అవసరమని తెలంగాణ రాజ్యాధికార పార్టీ బలంగా విశ్వసిస్తోంది. ఎస్సీ, ఎస్టీలకు అమలవుతున్న సబ్ ప్లాన్ తరహాలోనే, బీసీల కోసం కూడా ప్రత్యేక సబ్ ప్లాను తక్షణమే ఏర్పాటు చేయాలని ఆ పార్టీ తరపున పలు డిమాండ్లను అధికారులకు ఫిర్యాదు ద్వార తెలిపింది. తెలంగాణ ఏర్పడ్డ నాటి నుండి ఇప్పటి వరకు బీసీల కోసం బడ్జెక్ట్స్ కేటాయించి ఖర్చు చేయకుండా ఈ ప్రభుత్వాలు మిగుల్చుకున్నాయి. వాటి లెక్కలు క్లుప్తంగా వినతి పత్రం లొ పొందు పరిచింది. 2014 – 2024 వరకు బడ్జెట్లో బీసీలకు కేటాయింపులు, ఖర్చులు, మిగులు వివరాలు బడ్జెట్ కేటాయింపులు వంటి అంశాలను వినతి పత్రం లొ పొందు పరిచారు. రాష్ట్ర బడ్జెట్లో బీసీల జనాభా నిష్పత్తికి అనుగుణంగా నిధులను కేటాయించాలని డిమాండ్ చేశారు.

Read also : ఒక్క మండలంలోనే లిక్కర్ షాప్ రూల్స్.. ఆ ఎస్ఐవి శివమణి ఫోజులా?

కేటాయించిన నిధులు పక్కదారి పట్టకుండా, ఆర్థిక సంవత్సరం ముగిసినా ఆ నిధులు బీసీల కోసమే వినియోగించేలా సబ్ ప్లాను చట్టబద్దత కల్పించాలన్నారు. బీసీ విద్యార్థుల కోసం ప్రతి మండలంలో బహుజన గురుకుల పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. విదేశీ విద్యానిధి పథకాన్ని మరింత సరళతరం చేయాలన్నారు నిరుద్యోగ బీసీ యువతకు మరియు కుల వృత్తుల వారికి ఎటువంటి షరతులు లేకుండా సబ్సిడీతో కూడిన రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బీసీల సామాజిక, ఆర్థిక స్థితిగతులపై ప్రభుత్వం చేసిన సమగ్ర కుల గణన నివేదికను బయటపెట్టాలని అన్నారు.
తెలంగాణ రాజ్యాధికార పార్టీ డిమాండ్ చేస్తున్నది ఏమిటంటే, కేవలం నినాదాలతో కాకుండా, నిధులతో కూడిన చట్టబద్దమైన సబ్ ప్లాన్ ద్వారానే బీసీలకు సామాజిక న్యాయం జరుగుతుందని గుర్తుచేశారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సంబందిత అధికారులకు పిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి, మెదక్ సిద్దిపేట జిల్లాలో వినతి పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జ్యోతి పండల్, కార్యదర్శి రమేష్ యాదవ్, బస్సపురం నగేష్, సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు అనిల్ కుమార్, మెదక్ జిల్లా అధ్యక్షుడు ఇమామ్ పురం యాదగిరి, సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు తుప్పతి భిక్షపతి ఆయా మండలాల నాయకులు పాల్గొన్నారు.

Read also : మన పోలీసు వ్యవస్థను చూసి అందరూ నవ్వుతున్నారు : రోజా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button