
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణలోని పేదలకు రేవంత్ సర్కార్ తీపి కబురు చెప్పింది. రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అంగన్వాడీ సెంటర్లు, ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే సన్నబియ్యం పంపిణీ జరుగుతుంది. తర్వలో సాధారణ ప్రజలకు కూడా పూర్తి స్థాయిలో సన్నబియ్యం మంజూరు చేయాలని నిర్ణయం తీసుకుంది. రేషన్ డీలర్ల ద్వారా ఈ సన్న బియ్యం పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు తెలంగాణ పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక అప్డే్ట్ ఇచ్చారు. రాష్ట్రంలోని పేదలకు సన్న బియ్యం ఇచ్చేందుకు తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని చెప్పారు. రైతుల వద్ద కొనుగోలు చేసిన సన్న ధాన్యాన్ని గోదాముల్లో ఉంచి క్రమంగా మిల్లింగ్ చేయించనున్నట్లు చెప్పారు. తెలంగాణలో రికార్డు స్థాయిలో 80-85 లక్షల మెట్రిక్ టన్నుల సన్నధాన్యం ఉత్పత్తి అవుతోందన్న మంత్రి.. అందులో 36 లక్షల టన్నులు పీడీఎస్‌కు వచ్చినా సరిపోతుందన్నారు.
Read Also : 300 మంది అమ్మాయిల బాత్రూం వీడియోలు! మల్లారెడ్డి కాలేజీలో దారుణం
నెలకు 2 లక్షల టన్నుల చొప్పున సన్న బియ్యం పేదలకు పంపిణీ చేస్తామని మంత్రి వివరించారు. పేదలకు ఒక్కొక్కరికి నెలకు ఆరు కిలోల బియ్యం ఉచితంగా అందజేయనున్నట్లు వెల్లడించారు. సన్న ధాన్యం పండించిన రైతులకు రూ.500 బోనస్‌ను ఎటువంటి బకాయిలు లేకుండా పూర్తిగా చెల్లించినట్లు చెప్పారు. హుజూర్‌నగర్‌లో నిర్మాణంలో ఉన్న 2,160 ఇళ్లను మరో రెండు నెలల్లో పూర్తి చేసి పేదలకు అందజేస్తామని ఉత్తమ్ తెలిపారు. ఇక తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం చాలా కాలంగా ప్రజలు ఎదురు చూస్తున్నారు. కుటుంబాలు ఏర్పడిన వారు, పెళ్లిళ్లు చేసుకున్నవారు రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ప్రభుత్వం అసెంబ్లీలో కీలక ప్రకటన చేసింది. సంక్రాంతి నుంచి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ప్రజా పాలనలో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా అర్హులైన వారికి రేషన్ కార్డులు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. కొత్తగా దాదాపు 30 లక్షల రేషన్ కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలిసింది. ఈ మేరకు ఎల్లుండి జరిగే కేబినెట్ భేటీలో రేషన్ కార్డులపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది.
ఇవి కూడా చదవండి :
- మరో కానిస్టేబుల్ ఆత్మహత్య.. తెలంగాణ పోలీసులకు ఏమైంది!
- ముందడుగు వేసిన ప్రభాస్!… డ్రగ్స్ పట్ల అభిమానులకు సందేశం?
- రెండు రోజులు ఎంజాయ్ చేయనివ్వండి.. కేటీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి సెటైరికల్ కామెంట్స్
- కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో ముగిసిన వాదనలు.. అప్పటివరకు అరెస్టు చేయొద్దు!!
- పవిత్రమైన అయ్యప్ప మాలలో ఉండి.. ఇంత ఘోరమేంటి స్వామి..!!!