తెలంగాణ

Telangana: స్కూళ్లకు సెలవులు

Telangana: రాబోయే డిసెంబర్ 11న జరగనున్న తొలి విడత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పలు పాఠశాలల్లో సాధారణ విద్యా కార్యక్రమాలు తాత్కాలికంగా నిలిచిపోనున్నాయి.

Telangana: రాబోయే డిసెంబర్ 11న జరగనున్న తొలి విడత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పలు పాఠశాలల్లో సాధారణ విద్యా కార్యక్రమాలు తాత్కాలికంగా నిలిచిపోనున్నాయి. ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు సజావుగా సాగేందుకు, పోలింగ్ ప్రక్రియ ఎలాంటి అంతరాయం లేకుండా ఉండేందుకు స్కూళ్లను పూర్తిగా ఖాళీ చేయాల్సి రావడంతో రెండు రోజుల సెలవులు ప్రకటించారని జిల్లా విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు. డీఈఓలు విడుదల చేసిన ఆదేశాల ప్రకారం.. పోలింగ్ కేంద్రాలుగా గుర్తించిన విద్యాసంస్థలకు డిసెంబర్ 10, 11 తేదీల్లో సెలవులు అమల్లో ఉంటాయి.

డిసెంబర్ 10న పోలింగ్ స్టేషన్లను సిద్ధం చేయడం, బూత్ నిర్మాణం, భద్రతా సిబ్బంది కేటాయింపు, వసతులు ఏర్పాటు వంటి పర్యవేక్షణ పనులన్నీ స్కూల్ ప్రాంగణాల్లో జరిగే అవకాశం ఉండటంతో క్లాసులు రద్దు చేయాలని నిర్ణయించారు. తరువాతి రోజు అంటే డిసెంబర్ 11న అసలు పోలింగ్ జరగనుండటంతో, ఆ రోజు కూడా పాఠశాలలు మూసివేయడం తప్పనిసరి అని అధికారులు తెలిపారు. ఈ నిర్ణయం పూర్తిగా ఎన్నికల నిర్వాహణకు అనుకూలంగా ఉండేలా, ఎలాంటి రద్దీ లేదా అంతరాయం లేకుండా చూడడానికేనని పేర్కొన్నారు.

తొలి విడతలో మొత్తం 4,236 గ్రామాల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్న ఎన్నికల్లో ఉపాధ్యాయుల పాత్ర కీలకం. పోలింగ్ డ్యూటీలు, బూత్ నిర్వహణ, EVM‌ల ఏర్పాటు, ఓటర్ల సౌకర్యాలు, భద్రతా చర్యల పర్యవేక్షణ వంటి బాధ్యతలు ఉపాధ్యాయులపై ఉండటంతో పాఠశాలల్లో అందుబాటులో ఉండే సిబ్బంది దాదాపు లేకపోవడం కూడా సెలవుల నిర్ణయానికి ఒక ప్రధాన కారణంగా పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం విద్యా సంస్థలను ఉపయోగించడం గతంలో కూడా అనేకసార్లు జరిగింది. ఈసారి కూడా అదే విధమైన ప్రక్రియ కొనసాగుతోంది.

ఇక విద్యార్థులు, తల్లిదండ్రులకు అధికారులు ప్రత్యేక సూచనలు జారీ చేశారు. ప్రతి ప్రాంతంలో సెలవుల పరిస్థితి కొద్దిగా మారవచ్చని, తమ ప్రాంతానికి సంబంధించిన DEO కార్యాలయం లేదా స్కూల్ యాజమాన్యం ఇచ్చే తాజా సమాచారం గమనించాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికలు పూర్తయిన తర్వాత 12వ తేదీ నుంచి సాధారణ పాఠశాల పనులు తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

ఇందులో ముఖ్యంగా గమనించాల్సిందేంటంటే.. రెండు రోజుల సెలవులు అన్ని స్కూళ్లకూ వర్తించవు. పోలింగ్ కేంద్రాలుగా ఉపయోగించే పాఠశాలలకు మాత్రమే ఈ ఆదేశాలు వర్తిస్తాయి. మిగతా పాఠశాలల్లో తరగతులు యథావిధిగా కొనసాగుతాయి. పోలింగ్ ఏర్పాట్లు, ఉపాధ్యాయుల ఎన్నికల విధులు, బూత్ సెట్‌ప్ వంటి కారణాల వల్ల మాత్రమే ఈ సెలవులు ప్రకటించినట్లు స్పష్టం చేశారు.

ALSO READ: HI ALERT: ఎవ్వరూ బయటకు రావొద్దు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button