ఫార్మూలా ఈ కార్ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది.
విచారణ కోసం ఏసీబీ కార్యాలయానికి కేటీఆర్ తో పాటు అడ్వకేట్ కు అనుమతి ఇచ్చింది. ఇన్వెస్టిగేషన్ రూమ్ లో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సమక్షంలో కొనసాగనుంది విచారణ.
కేటీఆర్ తో పాటు అడ్వకేట్ రామచందర్ ఏసీబీ ఆఫీస్ లోకి వెళ్ళాలని హైకోర్టు పర్మిషన్ ఇచ్చింది. ఇన్వెస్టిగేషన్ రూమ్ పక్కన ఉన్న లైబ్రరీ లో కూర్చొని… లైబ్రరీ విండో నుంచి ఇన్వెస్టిగేషన్ ను అడ్వకేట్ అబ్జర్వ్ చేయొచ్చని సూచించింది. విచారణ లో ఏమైనా ఇబ్బంది ఉన్నా.. ఇన్వెస్టిగేషన్ రూమ్ నుండి అడ్వకేట్ కి కేటీఆర్ కనిపించకపోయినా.. రేపు మళ్ళీ కోర్టుకు రమ్మని కేటీఆర్ తరపు న్యాయవాదికి సూచించింది తెలంగాణ హైకోర్టు ధర్మాసనం.