తెలంగాణ

రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల వేలానికి సర్కార్ కసరత్తు.. దశల వారీగా విక్రయానికి నిర్ణయం!!

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : రాజీవ్‌ స్వగృహ కార్పొరేషన్‌ పరిధిలోని ఆస్తులపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాజీవ్ స్వగృహ అపార్ట్‌మెంట్‌ ఫ్లాట్లు, టవర్స్, ఖాళీ స్థలాల విక్రయానికి రంగం సిద్ధం చేస్తోంది. దశల వారీగా ఆయా ఆస్తులను విక్రయించాలని తెలంగామ ప్రభుత్వం నిర్ణయించింది. తొలిదశలో గ్రేటర్‌ హైదరాబాద్ పరిధిలో నివాసానికి సిద్ధంగా ఉన్న 760 ఫ్లాట్లను విక్రయించేందుకు డిసైడ్ అయ్యారు. ఈ మేరకు అధికారులు రూపొందించిన దస్త్రానికి సర్కార్ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. ముందుగా నాగోల్ బండ్లగూడలో 159 ఫ్లాట్లు, పోచారంలోని 601 ఫ్లాట్లను వేలం వేయాలని డిసైడ్ అయింది. ఆ తర్వాత రెండో దశలో నిర్మాణ పనులు మధ్యలో నిలిచిపోయిన టవర్స్ అపార్ట్‌మెంట్లను విక్రయించనున్నారు.

Read Also : బాయ్స్ హాస్టల్‌లో దారుణ ఘటన.. ప్రియురాలి కోసం యువకుని దారుణహత్య!!

గాజులరామారం, పోచారం, జవహర్‌నగర్‌లో 28 టవర్స్‌లోని పెద్ద సంఖ్యలో ఫ్లాట్లు నిర్మాణం పూర్తి కాకుండా అసంపూర్తిగా ఉన్నాయి. వాటిని వేలం ద్వారా బిల్డర్స్‌కు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిర్మాణం పూర్తయి.. విక్రయానికి సిద్ధంగా ఉన్న ఫ్లాట్ల విక్రయ ప్రక్రియ పూర్తి అయిన తరవాత టవర్స్‌ వేలం వేయాలని రేవంత్ సర్కార్ యోచిస్తోంది. ఈ రెండు దశల విక్రయాలతో రూ. 800 కోట్ల వరకు ఆదాయం వస్తుందని ప్రభుత్వ అంచనా వేస్తోంది. పోచారంలోని 601 ఫ్లాట్ల ద్వారా రూ. 98 కోట్లు, బండ్లగూడలోని 159 ఫ్లాట్ల ద్వారా రూ. 30 కోట్లు ఆదాయం సమకూర్చుకోవచ్చునని సర్కారుకు పంపిన ప్రతిపాదనల్లో అధికారులు పేర్కొన్నారు. అసంపూర్తిగా ఉన్న టవర్స్‌ విక్రయం ద్వారా మరో రూ.637 కోట్లు ఆర్జించవచ్చునని చెప్పారు.

Also Read : ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్‌ కంపెనీలో పేలిన రియాక్టర్.. ఒకరు మృతి, ఏడుగురికి తీవ్ర గాయాలు

రాజీవ్‌ స్వగృహ పథకం కింద అపార్ట్‌మెంట్లు, ఇండిపెండెంట్ ఇండ్లు, ఖాళీ స్థలాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. ఏడాదిన్నర కింద ఒకదఫా వీటిని అమ్మగా ప్రభుత్వానికి రూ. 1,800 కోట్ల వరకు ఆదాయం వచ్చింది. తాజాగా మరోసారి ఆదాయంపై దృష్టి సారించిన ప్రభుత్వం.. అసంపూర్తిగా ఉన్న అపార్ట్‌మెంట్లను పూర్తి చేసి విక్రయించుకునేందుకు ముందుకు వచ్చే బిల్డర్స్‌కు మాత్రమే వేలంలో వాటిని అప్పగించాలని నిర్ణయించింది. రాజీవ్‌ స్వగృహ పరిధిలో ఉన్న అన్ని ఫ్లాట్ల ద్వారా సుమారు రూ.2,500 కోట్ల వరకు ఆదాయాన్ని సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. తొలి విడతలో వేలం ప్రక్రియను వచ్చే నెలలో చేపట్టాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి : 

  1. అల్లు అర్జున్ కి గుడ్ న్యూస్!.. కానీ దేశం వదిలి వెళితే కఠిన చర్యలు?
  2. అయోమయంలో జగన్!… పార్టీ భవిష్యత్తు సజ్జల చేతిలో?
  3. పవన్ కల్యాణ్ దెబ్బ.. హోం మంత్రి అనిత పీఏ పై వేటు
  4. సంక్రాంతి తర్వాత రేషన్ కార్డులు.. రైతు భరోసాకు కొత్త రూల్స్!
  5. ఇకపై దేవాలయాలలో విజయ నెయ్యి మాత్రమే వాడాలి: తెలంగాణ ప్రభుత్వం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button