చైనాలో కొత్త వైరస్ తీవ్రత మరింత పెరిగింది. చైనాలోని హాస్పిటల్స్ అన్ని రోగులతో నిండిపోయాయని తెలుస్తోంది. ఇప్పటికే వందలాది మంది చనిపోయారనే వార్తలు వస్తున్నాయి. జలుబు, దగ్గు సమస్యలతో లక్షలాది మంది అనారోగ్యం భారీన పడ్డారని అంటున్నారు. కొత్త వైరస్ ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్నా చైనా మాత్రం స్పందించడం లేదు. వైరస్ తీవ్రత ఏమి లేదని చెబుతోంది.
చైనాలో HMPV వైరస్ తో దేశవ్యాప్తంగా వైద్య శాఖ అప్రమత్తం చేసింది. ఇందులో భాగంగానే తెలంగాణ సర్కార్ ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంది. చైనాలో HMPV వైరస్ వ్యాప్తి చెందుతున్న కారణంగా.. శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్ల నుండి సురక్షితంగా ఉండటానికి కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది తెలంగాణ ఆరోగ్య శాఖ. రద్దీగా ఉండే ప్రదేశాలను నివారించాలని, సబ్బు లేదా శానిటైజర్‌తో మీ చేతులను తరచుగా కడగాలని సూచించింది.
బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయకూడదని, అనారోగ్యంగా ఉన్న వ్యక్తులు దగ్గరకి వెళ్లకూడదని అంటూ కొన్ని మార్గదర్శకాలను సూచించిన తెలంగాణ ఆరోగ్య శాఖ హెచ్చరించింది.