Homeతెలంగాణక్రైమ్ మిర్రర్ బ్రేకింగ్: నేడు 3 గంటలకు మంత్రివర్గ సమావేశం

క్రైమ్ మిర్రర్ బ్రేకింగ్: నేడు 3 గంటలకు మంత్రివర్గ సమావేశం

క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ రోజు (ఫిబ్రవరి 23, 2026) మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనుంది.  సమావేశంలో రైతు భరోసా అమలు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక మరియు ఆరు గ్యారంటీల అమలు పురోగతిని సమీక్షించనున్నారు.

బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు వీలుగా అసెంబ్లీ సమావేశాల తేదీలను ఖరారు చేసే అవకాశం ఉంది. సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగంపై కూడా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

అలాగే రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనలు, శాఖల వారీగా నిధుల కేటాయింపులపై మంత్రివర్గం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ZPTC, MPTC మరియు GHMC ఎన్నికల నిర్వహణపై కూడా సమగ్రంగా చర్చించనున్నారు అని సమాచారం.

తాజావార్తలు