Saturday, March 21, 2026
HomeతెలంగాణTelangana Cabinet: క్యాబినెట్ లోకి రాములమ్మ! మరో డిప్యూటీ సీఎం గా బీసీ నేత!

Telangana Cabinet: క్యాబినెట్ లోకి రాములమ్మ! మరో డిప్యూటీ సీఎం గా బీసీ నేత!

* మంత్రివర్గంలో మార్పులు

* భారీ ప్రక్షాళన దిశగా రేవంత్

* కొత్తగా ముగ్గురు ఎంట్రీ

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాజకీయంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పంచాయితీ ఎన్నికలతో పాటు మున్సిపల్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలతో పార్టీలో ప్రక్షాళనకు దిగుతున్నారు. ఒక్క పార్టీ మాత్రమే కాదు ప్రభుత్వంలో కూడా ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నారు. మంత్రివర్గంలో మార్పులపై కసరత్తు చేస్తున్నారు. ఇంకోవైపు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మార్పు ఖాయంగా కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఈ మార్పులు ఉండనున్నాయి. మరోవైపు తెలంగాణ క్యాబినెట్ లోకి విజయశాంతి ఎంట్రీ ఉంటుందన్న ప్రచారం పొలిటికల్ వర్గాల్లో నడుస్తోంది. ఆమెతో పాటు కొత్తగా ముగ్గురు క్యాబినెట్ లోకి రానున్నట్లు ప్రచారం సాగుతోంది. తెలంగాణలో అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్న తరుణంలో ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. కొంతమంది మంత్రుల మార్పు ఉంటుందన్న సంకేతాలు కూడా తెలంగాణ కాంగ్రెస్ నుంచి అందుతున్నాయి.

మరో డిప్యూటీ సీఎం గా బీసీ నేత..

తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ఉన్నారు. డిప్యూటీ సీఎం గా భట్టి విక్రమార్క ఉన్నారు. అయితే డిప్యూటీ సీఎం గా మరో బీసీ నేతకు చాన్స్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఎమ్మెల్సీగా ఉన్న విజయశాంతిని గతంలో ఇచ్చిన హామీ మేరకు మంత్రివర్గంలోకి తీసుకుంటారని కూడా తెలుస్తోంది. పీసీసీ చీఫ్ గా ఉన్న మహేష్ గౌడ్ ను మంత్రివర్గంలోకి తీసుకొని.. పిసిసి అధ్యక్ష బాధ్యతలు మరొకరికి ఇస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న క్యాబినెట్లో ఇద్దరి మంత్రులను తప్పించడం ఖాయం అని కూడా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ ను మంత్రివర్గంలోకి తీసుకొని బీసీల కోటాలో డిప్యూటీ సీఎం హోదా కల్పిస్తారని కూడా టాక్ నడుస్తోంది.

మహేష్ కుమార్ గౌడ్ కు ఛాన్స్..

ప్రస్తుతం తెలంగాణ డిప్యూటీ సీఎం గా ఎస్సీ వర్గం నుంచి భట్టి విక్రమార్క ఉన్నారు. దామోదర్ రాజ నరసింహ, వివేక్ వెంకటస్వామి, అడ్డూరి లక్ష్మణ్ మంత్రులుగా కొనసాగుతున్నారు. బీసీల నుంచి పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, కొండ సురేఖలు ఉన్నారు. వీరితో పాటు మరొకరిని డిప్యూటీ సీఎం గా తీసుకుంటే బీసీలకు మరింత ప్రాధాన్యం ఇచ్చినట్లు అవుతుంది. ఒకవేళ టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మంత్రివర్గంలోకి తీసుకుంటే ఆయన స్థానంలో మరో నేతకు అవకాశం ఇస్తారు. ప్రధానంగా పొన్నం ప్రభాకర్ పేరు టిపిసిసి అధ్యక్షుడిగా వినిపిస్తోంది.

విజయశాంతి కీలకం

తెలుగు చిత్ర పరిశ్రమలో విజయశాంతి తనకంటూ ఒక ముద్ర చాటుకున్నారు. లేడీ సూపర్ స్టార్ గా ఎదిగారు. ప్రారంభంలో కెసిఆర్ తో తెలంగాణ ఉద్యమంలో బలంగా పనిచేశారు విజయశాంతి. తరువాత అదే కెసిఆర్ తో విభేదించి బిజెపి, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం కాంగ్రెస్లో ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఆమెను మంత్రివర్గంలోకి తీసుకుంటే కీలక మంత్రిత్వ శాఖను అప్పగిస్తారని తెలుస్తోంది. అదే జరిగితే తెలంగాణ రాజకీయాల్లో విజయశాంతి మరోసారి కీలకం అవుతారు.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను.2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను.ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments