తెలంగాణ

ఢిల్లీకి సీఎం రేవంత్.. రాజగోపాల్ రెడ్డితో పాటు ఈ ఐదుగురికి పక్కా?

15 నెలలుగా పెండింగ్ లో ఉన్న తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు ఎట్టకేలకు ముహుర్తం ఖరారైందని తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను హైకమాండ్ హస్తినకు పిలిచింది. కేబినెట్ విస్తరణ కోసమే రేవంత్ టీమ్ ను ఢిల్లీకి పిలిచారనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటివరకు 39 సార్లు ఢిల్లీకి వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. అయిన వెళ్లిన ప్రతిసారి మంత్రివర్గ విస్తరణ ఖరారవుతుందనే వార్తలు వచ్చాయి. కాని జరగలేదు. అయితే ఈసారి మాత్రం పక్కా అంటున్నారు. ఉగాది మంత్రివర్గ విస్తరణ ఖాయమని చెబుతున్నారు.

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఆరు బెర్త్‌లను భర్తీ చేయాలని హైకమాండ్ డిసైడ్‌ అయ్యింది. ప్రస్తుత కేబినెట్‌లో చోటు దక్కని సామాజికవర్గాల నేతలకు పదవులు కట్టాబెట్టాలని పార్టీ పెద్దలు నిర్ణయించినట్టు సమాచారం. నల్గొండ జిల్లా నుంచి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌ రెడ్డి, దేవరకొండ నుంచి బాలు నాయక్‌ పోటీ పడుతున్నారు. వీరిలో ఓసీ కోటాలో రాజ్‌గోపాల్ రెడ్డికి పదవి ఖాయమని తెలుస్తోంది. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రిగా ఉన్నా.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో హైకమాండ్ ఇచ్చిన హామీ మేరకు రాజగోపాల్ రెడ్డికి మంత్రిపదవి ఖాయమని తెలుస్తోంది. రాజగోపాల్ రెడ్డిని కేబినెట్ లోకి తీసుకుంటే.. బాలు నాయక్‌కు ఏ పదవి ఇస్తారనేది చూడాల్సి ఉంది.

Also Read : జులైలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు – ఆ తర్వాత స్థానిక సంస్థలకు..!

ఇక నిజామాబాద్ జిల్లా కోటాలో మాజీ మంత్రి సుదర్శన్‌ రెడ్డికి లైన్‌ క్లియర్‌ అయినట్టు తెలుస్తోంది. ఇక ఆదిలాబాద్ జిల్లా నుంచి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌ సాగర్ రావు, గడ్డం పోటీ పడుతున్నారు. ప్రేమ సాగర్ రావు కోసం భట్టి పట్టుబడుతుండగా.. రేవంత్ కోటాలో వివేక్ ఉన్నారు. ప్రేమ్‌ సాగర్‌ రావుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.బీసీ కోటాలో ఇద్దరు నేతలకు మంత్రి పదవి వరించే చాన్స్‌ ఉందని అంటున్నారు. వీరిలో ఎమ్మెల్సీ విజయశాంతి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆమెకు రాష్ట్ర హోంమంత్రి పగ్గాలు అప్పగిస్తారని టాక్‌. ఈమెతో పాటు.. వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, మక్తల్‌ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, పఠాన్‌చెరుకు చెందిన నీలంమధు ముదిరాజ్‌ పేర్లను పార్టీ పెద్దలు పరిశీలిస్తున్నారట.

Also Read : ప్రాణాపాయ స్థితిలో బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్!.. పరిస్థితి విషమం?

ఇక మైనారిటీ కోటాలో అమీర్ అలీఖాన్‌కు కేబినెట్‌ బెర్త్‌ కన్‌ఫర్మ్‌ అయ్యిందంటున్నారు. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాకు మంత్రివర్గంలో చోటు లేదు.. దాంతో మల్‌ రెడ్డి రంగారెడ్డి, లేదా.. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిల్లో ఎవరో ఒక్కరికి మంత్రి పదవి ఖాయమని అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button