-
25 సభ్యుల స్థానాల కోసం 203 మంది అభ్యర్థులు పోటీ
-
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 35,316 మంది న్యాయవాదులు ఓటు వేయడానికి అర్హులు
క్రైమ్ మిర్రర్, తెలంగాణ ఇన్వెస్టిగేషన్ బ్యూరో: నేడు తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికలు జరుగుతున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, జనవరి 31 లోపు ఈ ఎన్నికలను పూర్తి చేయాల్సి ఉంది. నేడు ఉదయం 10:30 నుండి సాయంత్రం 5:00 గంటల వరకు. హైకోర్టు రిటైర్డు జడ్జి జస్టిస్ యతిరాజులు నేతృత్వంలో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 35,316 మంది న్యాయవాదులు ఓటు వేయడానికి అర్హులు. మొత్తం 25 సభ్యుల స్థానాల కోసం 203 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఓట్ల లెక్కింపు మరియు ఫలితాల వెల్లడి ఫిబ్రవరి 10, 2026న బార్ కౌన్సిల్ ప్రాంగణంలో జరుగుతుంది. రాష్ట్రంలోని అన్ని కోర్టుల్లో న్యాయవాదులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.





