
క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- ఏఐ టెక్నాలజీ గురించి తాజాగా మెగాస్టార్ చిరంజీవి కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. తాజాగా హైదరాబాదులో నిర్వహించిన ఏక్తా దివస్ 2k రన్ కార్యక్రమంలో భాగంగా చిరంజీవి పాల్గొన్నారు. ఈమధ్య ఏఐ టెక్నాలజీతో ఎంత మంచి జరిగినా కూడా దానికన్నా ఎక్కువ చెడునే జరుగుతుంది అని మెగాస్టార్ చిరంజీవి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా చిరంజీవికి సంబంధించి పోర్న్ సైట్లలో తన డీప్ ఫేక్ వీడియోలు రావడంపై స్పందించిన విషయం ప్రతి ఒక్కరికి. అయితే ఇలాంటి వాటి పట్ల ఎవరికి కూడా ఎటువంటి భయం అవసరం లేదు అని.. మనమేంటో.. మన వ్యక్తిత్వం ఏంటో ప్రతి ఒక్కరికి తెలుసు కదా అని చెప్పుకొచ్చారు. ఈ డీప్ ఫేక్ పై అన్ని ప్రభుత్వాలు కలిపి కొన్ని చట్టాలు తీసుకురావాలని… లేకపోతే భవిష్యత్తులో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయని చిరంజీవి మరోసారి పోలీసులకు సూచించారు. ప్రస్తుత రోజుల్లో AI ని విపరీతంగా ఇష్టం వచ్చినట్లు వాడుతున్నారు అని మండిపడ్డారు. కాగా చిరంజీవి ఫిర్యాదు చేసినటువంటి కేసును ప్రస్తుతం సీపీ సజ్జనార్ పర్యవేక్షిస్తూ ఉన్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని తెలిపారు. భవిష్యత్తులో ఈ డీప్ ఫేక్ వీడియోలకు ఎవరూ కూడా బాధ్యులు కాకుండా చూసుకునే బాధ్యత కూడా మాదే అని హామీ ఇచ్చారు. కానీ సోషల్ మీడియా వేదికగా చాలామంది కూడా వీటిని అడ్డుకోవడం ఎవరి తరం కాదు అని కామెంట్లు చేస్తున్నారు. మరి భవిష్యత్తులో ఈ ఏఐ ఎలాంటి ముప్పునకు దారితీస్తుందో ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితులు ఏర్పడ్డాయి.
Read also : ఈ జిల్లాలకు వర్షాల విముక్తి ఇంకెప్పుడు?
Read also : నేడు పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ప్రకాశం బ్యారేజ్ కు రెండో ప్రమాద హెచ్చరిక!
 
				 
					
 
						 
						




