క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- టీం ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ రంజిత్ ట్రోఫీలో అడుగు పెట్టాడు. దాదాపుగా 13 ఏళ్ల తర్వాత తిరిగి మళ్లీ రంజి మ్యాచ్ ఆడడానికి ఢిల్లీ చేరుకున్నాడు. ఇవాళ రైల్వేస్ మరియు ఢిల్లీ మధ్య మ్యాచ్ జరుగుతుండగా ఢిల్లీ తరపున విరాట్ కోహ్లీ ఆడుతున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే టాస్ గెలిచిన ఢిల్లీ చేజింగ్ తీసుకోగా విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ చేయడానికి గ్రౌండ్లోకి అడుగుపెట్టిన క్షణాన ఢిల్లీ స్టేడియం అంతా కూడా “కోహ్లీ…కోహ్లీ” అంటూ కేరింతలు పెట్టారు. దీంతో ఒక్కసారిగా స్టేడియం మొత్తం దద్దరిల్లింది. నిమిషానికి ఒకసారి స్టేడియం మొత్తం కూడా అరుపులతో హోరెత్తుతుండగా, మరోవైపు ఓ అభిమాని బారికేడ్స్ దాటుకొని గ్రౌండ్లోకి పరిగెత్తుకొచ్చి విరాట్ కోహ్లీ కాళ్ళను మొక్కాడు. ఇక వెంటనే సెక్యూరిటీ సిబ్బంది అతనిని తీసుకొని వెళ్ళిపోయారు.
దిల్ రాజ్ మాస్టర్ ప్లాన్!… 100 కోట్ల నష్టాన్ని కేవలం 2 రోజుల్లోనే రికవరీ?
ఇక విరాట్ కోహ్లీ చివరిగా 2012లో రంజీ ట్రోఫీ ఆడడం జరిగింది. ఇక ఆ తరువాత ఇండియా టీం లో సుస్థిరమైన అవకాశాలతో ఎన్నో రికార్డులు నెలకొల్పి టీం ఇండియాకు ఎన్నో తిరుగులేని విజయాలు అందించాడు. ఇప్పుడు దాదాపుగా 13 ఏళ్ల తర్వాత రంజి మ్యాచ్ ఆడడంతో ఫ్యాన్స్ విపరీతంగా స్టేడియానికి చేరుకున్నారు. స్టేడియం ముందు కొంచెం తొక్కిసలాట జరిగినట్లు కూడా చాలా వార్తలు వస్తున్నాయి. కానీ అధికారికంగా వీటిపై ఎలాంటి స్పష్టత అనేది రాలేదు. కోహ్లీ రాకతో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం పూర్తిగా కోహ్లీ నామస్మరణ వినిపిస్తుంది.
తొక్కిసలాట దెబ్బతో కొత్త రూల్స్ ప్రకటించిన UP ప్రభుత్వం!..!..
చరిత్ర సృష్టించిన మహాకుంభమేళా!… ఐదు కోట్ల మంది భక్తుల పై పూలవర్షం?