క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- టీమిండియా కొత్త జెర్సీ నీ తాజాగా బీసీసీఐ విడుదల చేసింది. రేపు ఇంగ్లాండుతో జరగబోయే ఓడి సిరీస్లలో టీమిండియా ఆటగాళ్లు ఈ జెర్సీని ధరించనున్నారు. కాగా కొత్త జెర్సీతో టీమ్ ఇండియా సభ్యులు దిగిన ఫోటోలను బీసీసీఐ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసింది. బీసీసీఐ విడుదల చేసిన ఈ కొత్త జెర్సీ చూడడానికి చాలా బాగుంది. భుజాల వద్ద జాతీయ జెండా రంగు పెద్దగా కనిపించేలా దీనిని స్పెషల్ గా డిజైన్ చేశారు. ఎంతో స్టైలిష్ గా, క్లాసి లుక్ తో కనిపిస్తున్న ఈ జెర్సీలలో మన టీమ్ ఇండియా క్రికెట్ ప్లేయర్లు అదిరిపోయారు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా రేపు విదర్భ స్టేడియంలో ఇంగ్లాండ్ తో టీమిండియాకు తొలి వన్డే జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే.
అయితే ఇప్పటికే రేపు జరగబోయే విదర్భ స్టేడియం దగ్గర టికెట్ల కోసం కొంచెం తొక్కిసల ఆట జరిగినట్లుగా సమాచారం. టికెట్ల కోసం చాలామంది క్రికెట్ అభిమానులు ఎగబడినట్లుగా సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. కాగా రేపు ఇంగ్లాండ్ తో టీమిండియా మొదటి ఓడి తలపడునుంది. అయితే ఇంగ్లాండ్ తో ఇప్పటికే t20 సిరీస్ ను టీమిండియా కైవసం చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే.
ఇవి కూడా చదవండి
1.త్రివేణి సంగమంలో అమృత స్నానం ఆచరించిన ప్రధాన మంత్రి?