క్రీడలు

రాజు లేని రాజ్యంలా టీంఇండియా.. నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ ఆసక్తికర వ్యాఖ్యలు!!

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : 15 ఏళ్ల నుంచి జట్టుతో ట్రావెల్ అవుతున్నాడు. టన్నుల కొద్దీ పరుగులు, సెంచరీల మీద సెంచరీలు బాదాడు. ఊహించని విజయాలు అందించాడు. ఏకంగా వరల్డ్ కప్ ట్రోఫీనే తీసుకొచ్చాడు. కానీ అతడికి ఆఖరుకు అవమానమే మిగిలింది. ఫామ్‌లో లేడని టీమ్ నుంచి డ్రాప్ చేసేశారు. మనం మాట్లాడుకుంటోంది మరెవరి గురించో కాదు.. భారత జట్టు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ గురించేనని అర్థమయ్యే ఉంటుంది. ఈ మధ్య టెస్టుల్లో వరుసగా విఫలవుతుండటం, జట్టు కూడా వరుస ఓటములతో విమర్శలపాలవుతుండటంతో హిట్‌మ్యాన్‌ను సిడ్నీ టెస్టులో ఆడించలేదు టీమ్ మేనేజ్‌మెంట్. అతడి ప్లేస్‌లో శుబ్‌మన్ గిల్‌ను తీసుకున్నారు. ఈ విషయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్న వేళ మాజీ క్రికెటర్ నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Read Also : రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల వేలానికి సర్కార్ కసరత్తు.. దశల వారీగా విక్రయానికి నిర్ణయం!!

రోహిత్ లేని భారత జట్టును ఊహించడం కష్టంగా ఉందన్నాడు నవ్‌జ్యోత్ సిద్ధూ. ఇప్పుడు టీమిండియా రాజు లేని రాజ్యంలా బోసిపోయిందన్నాడు. మెన్ ఇన్ బ్లూ పని అయిపోయిందని.. గేమ్ ఓవర్ అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. జట్టు ఇన్నేళ్ల నుంచి ఎంతో సేవలు అందిస్తూ వస్తున్న హిట్‌మ్యాన్‌కు మరింత గౌవరం దక్కాల్సిందన్నాడు. అతడికి రెస్పెక్ట్ ఇచ్చి నమ్మాల్సిందంటూ మేనేజ్‌మెంట్‌ మీద ఫైర్ అయ్యాడు. గంభీర్ విశ్వాసం ఉంచితే రోహిత్ త్వరగా బ్యాటింగ్‌లో ఫామ్ అందుకునేవాడని చెప్పాడు సిద్ధూ. 6 నెలల కిందే టీమిండియాకు టీ20 వరల్డ్ కప్ అందించాడని.. ఆ మెగాటోర్నీలో అతడు బ్యాట్‌తో ఎంతగా విజృంభించాడో అందరూ చూశారన్నాడు.

Also Read : హైడ్రా కీలక నిర్ణయం.. ఇకపై హైడ్రా గ్రీవెన్స్‌, వారం రోజుల్లో హైడ్రా పోలీస్‌స్టేషన్‌!!

‘ఒక కెప్టెన్‌గా 150 కోట్ల మంది భారతీయులకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు రోహిత్ శర్మ. అలాంటోడ్ని ఓ సిరీస్ మధ్యలో ఇలా జట్టు నుంచి తొలగించడం ఎంతవరకు కరెక్ట్? ఇది తప్పుడు సంకేతాల్ని పంపిస్తోంది. ఒక ఆటగాడ్ని అదీ రోహిత్ లాంటి బిగ్ ప్లేయర్‌ను కెప్టెన్‌గా నియమించినప్పుడు అతడ్ని సిరీస్ మొత్తం ఆడించాలి. ఫామ్‌తో సంబంధం లేకుండా టీమ్‌లో కంటిన్యూ చేయాలి. రోహిత్‌ను దింపేశారా? లేదా అతడే దిగిపోయాడా? అని మాట్లాడుకుంటున్నారు. అసలు కెప్టెన్‌కు దిగిపోయే అవకాశం ఇవ్వడం ఏంటి? మ్యాచ్‌కు దూరంగా ఉండే ఆప్షన్ ఎందుకు ఇవ్వాలి?’ అని సిద్ధూ ప్రశ్నించాడు. కాగా, సిడ్నీ టెస్ట్‌లో ఆడకపోవడంపై రోహిత్ క్లారిటీ ఇచ్చాడు. తాను ఆడాలా? వద్దా? అనేది ఇతరులు డిసైడ్ చేయలేరన్నాడు. తనకు మైండ్, మెచ్యూరిటీ ఉన్నాయని.. ఎప్పుడు ఏం చేయాలో బాగా తెలుసునన్నాడు. జట్టు బాగు కోసమే బరిలోకి దిగలేదని స్పష్టం చేశాడు.

ఇవి కూడా చదవండి : 

  1. తెలుగు భాషను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది.. తెలుగు మహాసభల్లో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
  2. ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్‌ కంపెనీలో పేలిన రియాక్టర్.. ఒకరు మృతి, ఏడుగురికి తీవ్ర గాయాలు
  3. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయి .. విమర్శలు గుప్పించిన కేటీఆర్
  4. రోడ్డు భద్రత అవగాహనపై బైక్ ర్యాలీ.. 300 హెల్మెట్లను ఉచితంగా పంపిణీ చేసిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి..
Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button