
కూటమి ప్రభుత్వం… వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను టార్గెట్ చేసినట్టే కనిపిస్తోంది. అందుకే.. ఒకరి తర్వాత మరొకరిపై కేసులు పెట్టుకుంటూ పోతోందన్న చర్చ జరుగుతోంది. వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళీతో మొదలుపెట్టి.. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి వరకు వచ్చింది. కాకాణి తర్వాత టార్గెట్‌ను కూడా కూటమి ప్రభుత్వం ఫిక్స్ చేసుకున్నట్టు సమాచారం. కాకాణి తర్వాత.. కూటమి సర్కార్ ఎవరో తెలుసా..? ఇంకెవరు ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి ఆర్కే రోజా అట. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో పెట్టిన ఆడుదాం ఆంధ్రాలో అవినీతి జరిగినట్టు ఆరోపిస్తున్నారు కూటమి నేతలు. ఆ అవినీతి వెలికితీసి.. రోజాను కూడా జైలుకు పంపాలన్న ప్లాన్ ఉన్నట్టు సమాచారం. మాజీ మంత్రి ఆర్కే రోజా త్వరలోనే అరెస్ట్ కాబోతున్నారని… శాప్ చైర్మన్ రవినాయుడు చెప్పారు. ఆ మాటల వెనుక.. కూటమి సర్కార్ వ్యూహం ఉందని అంటున్నారు విశ్లేషకులు.
Also Read : మూడేళ్లు కళ్లు మూసుకోండి.. ఆపై రాజ్యం వైసీపీదే – జగన్‌కు అంత ధీమా ఏంటో..?
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆడుదాం ఆంధ్ర అనే పేరుతో కార్యక్రమం నిర్వహించారు. అయితే.. ఈ కార్యక్రమంలో అవినీతి జరిగిందనేది కూటమి నేతల ఆరోపణలు. నిరుపేద క్రీడాకారులకు చెందాల్సిన 119 కోట్ల రూపాయలను రోజా.. స్వాహా చేశారట. ఆ డబ్బుతో నగలు కొనుక్కున్నారని ఆరోపిస్తున్నారు. ఆమె అవినీతిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరుగుతోందని శాప్ చైర్మన్ రవినాయుడు అంటున్నారు. త్వరలోనే రోజా జైలుకు వెళ్లడం ఖాయమని చెప్తున్నారు. అయితే.. కూటమి ప్రభుత్వంలోని పాలకులు కాకుండా… శాప్ చైర్మన్ ఈ విషయాలను ఎందుకు బయటపెట్టారనేదే అర్థంకాని విషయం.
Also Read : ఏపీలో 2029లో ఆ పార్టీనే అధికారంలోకి వస్తుంది: ఉండవల్లి అరుణ్ కుమార్
రెడ్‌బుక్‌లో ఉన్నవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేదని మంత్రి లోకేష్ ముందు నుంచీ చెప్తూనే ఉన్నారు. అంటే… ఆ క్రమంలోనే కేసులు, అరెస్టులు జరుగుతున్నాయా..? రెడ్‌బుక్‌లో పేర్ల క్రమం ప్రకారమే… వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేసిన మంత్రులను టార్గెట్ చేస్తున్నారా..? పోసాని కృష్ణమురళీ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేయలేదు… అందుకే సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు, ప్రెస్‌మీట్‌లో అసభ్యకర మాటల పేరుతో కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. మాజీ మంత్రులు పేర్ని నానిని, ఆయన కుటుంబసభ్యులపై రేషన్ బియ్యం మాయం పేరుతో కేసు పెట్టారు. వారు బెయిల్ తెచ్చుకున్నారు. జోగి రమేష్, ఆయన కుమారుడిపై కూడా పెట్టారు. నందిగం సురేష్‌ను కూడా జైల్లో పెట్టారు. టీడీపీ కార్యాయలంపై దాడి, కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు. వంశీ తర్వాత కొడాలి నానిని టార్గెట్ చేసినా… ఆయన ఆనారోగ్యంతో ఆస్పత్రిలో ఉండటంతో… కాకాణి చుట్టూ ఉచ్చు బిగించారు. ఇప్పుడు… ఆర్కే రోజాపై కేసులు పెట్టబోతున్నారన్న లీకులు ఇస్తున్నారు. ఇప్పటికే సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కుమారుడిపై కూడా సోషల్ మీడియా పోస్టుల విషయంలో కేసులు ఉన్నాయి. ఏదో ఒక విధంగా తమను టార్గెట్ చేయడమే కూటమి ప్రభుత్వం ఆలోచన అని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు.