ఆంధ్ర ప్రదేశ్జాతీయంరాజకీయం

తమిళనాడు గవర్నర్‌ రేసులో టీడీపీ సీనియర్‌ నేత..? రాజుగారికే ఛాన్స్‌..!

తమిళనాడు గవర్నర్‌ను తప్పిస్తున్నారా…? పెండింగ్‌ బిల్లుల విషయంలో సుప్రీం కోర్టు అక్షింతలు వేయడంతో…. గవర్నర్‌ను మార్చక తప్పని పరిస్థితి ఏర్పడిందా…? పదవీకాలం ముగియకముందే మార్పు అనివార్యంగా మారిందా..? అంటే… బీజేపీ ఆలోచన సరిగ్గా అలాగే ఉన్నట్టు తెలుస్తోంది. ఆర్‌ఎన్‌ రవి స్థానాన్ని… టీడీపీ సీనియర్‌ నేతలకు కట్టబెట్టాలని కేంద్రం భావిస్తోంది. ఇంతకీ… తమిళనాడు గవర్నర్‌ కాబోతున్న ఆ టీడీపీ సీనియర్‌ నేత ఎవరు…?

తమిళనాడులో స్టాలిన్‌ సర్కార్‌ వర్సెస్‌ రాజ్‌భవన్‌గా రాజకీయం నడుస్తోంది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను కూడా గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి… ఎటూ తేల్చకుండా పెండింగ్‌లో పెట్టారు. ఈ విషయంపై స్టాలిన్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో… ధర్మాసనం గవర్నర్‌ తీరును తప్పుబట్టింది. గవర్నర్‌ అనుమతి లేకుండానే పెండింగ్‌లో ఉన్న బిల్లును చట్టం చేసుకునే అవకాశం స్టాలిన్‌ సర్కార్‌కు ఇచ్చింది. దీంతో… గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి ఇబ్బందుల్లో పడ్డారు. ఈ పరిస్థితుల్లో… తమిళనాడు గవర్నర్‌గా రవిని కొనసాగించడం కరెక్ట్‌ కాదని భావిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఆయన స్థానాన్ని ఎన్డీయే మిత్రపక్షాలకు ఇవ్వాలని కూడా ఆలోచిస్తోంది.


Also Read : ఏపీలో లిక్కర్‌ స్కామ్‌ – హైదరాబాద్‌లో హడావుడి – కసిరెడ్డి నుంచి దారి జగన్‌ వైపుకా..!


ఈ క్రమంలో… ఎన్డీయో కూటమిలో కీలకమైన టీడీపీ, జేడీయూపై బీజేపీ చూపుపడినట్టు సమాచారం. ఈ రెండింటిలో టీడీపీనే బెస్ట్‌ అని భావనకు వచ్చిందట కేంద్రం. టీడీపీలోని సీనియర్‌ నేతకు తమిళనాడు గవర్నర్‌ పదవి ఇస్తే… ఏపీలో బీజేపీ పార్టీకి మరింత మైలేజ్‌ వస్తుందన్న ఆలోచనలో ఉందట. ఈ క్రమంలో… టీడీపీ నుంచి తమిళనాడు గవర్నర్‌ రేసులో ఎవరు ఉన్నారని చూసుకుంటే… ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. వారిలో ఒకరు కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతిరాజు. మరొకరు యనమల రామకృష్ణుడు. ఈ ఇద్దరిలో ముందు వరసలో… అశోక్‌గజపతి రాజే ఉన్నారని సమాచారం.

తమిళనాడు గవర్నర్‌గా ఆర్‌ఎన్‌ రవి పదవీకాలం 2026 వరకు ఉంది. అయితే…. సుప్రీంకోర్టు అక్షింతలతో.. ఆయన్ను గడువు కంటే ముందే మార్చాలని చూస్తోంది కేంద్రం. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో గవర్నర్ల పదవీకాలం త్వరలోనే ముగియబోతోంది. వాటితో పాటు.. తమిళనాడు గవర్నర్‌ను కూడా మార్చేస్తే ఒక పనైపోతుందని భావిస్తోందట. సో… త్వరలోనే అశోక్‌గజపతిరాజు గవర్నర్‌ పీఠం ఎక్కబోతున్నారన్న మాట.

ఇవి కూడా చదవండి .. 

  1. తెలంగాణలో ఫ్రూట్ జ్యూస్‌ తరహాలో టెట్రా ప్యాకెట్లలో మద్యం.

  2. మర్రిగూడ ఎంపిడివో రాజకీయం..!రాజకీయంగా మారిన కరువు పని? 

  3. కూటమిలో కరివేపాకులా బీజేపీ – అరకొర పోస్టులపై అసంతృప్తి..!

  4. కోమటిరెడ్డిపై గుత్తా తిరుగుబాటు.. రెండుగా చీలిన నల్గొండ కాంగ్రెస్?

  5. ఆస్తి కోసం కూతురును చంపి సవతి తల్లి.. నదిలో పాతి పెట్టిన వైనం!..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button