
టీడీపీ టార్గెట్ ఎవరంటే.. ఎప్పటికీ వైసీపీనే. ప్రస్తుత ఏపీ రాజకీయాల్లో ఇది అక్షరసత్యం. వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు స్కిల్ స్కామ్‌లో చంద్రబాబును జైలుకు పంపారు. రిమాండ్‌లో ఉంచారు. అందుకు బదులు తీర్చుకోవాలని టీడీపీ ప్లాన్ చేస్తుందా…? జగన్‌ను మరోసారి జైలుకు పంపాలని గ్రౌండ్ ప్రిపేర్ చేస్తుందా…? జగన్‌ను.. ఆ తర్వాత ఆయన కేబినెట్‌లో పనిచేసిన మంత్రులను ఆ లిస్ట్‌లో చేర్చిందా…? దొరికిన వారిని దొరికినట్టు కటకటాల వెనక్కి నెట్టాలని చూస్తుందా..? ఏపీలో ఢిల్లీకి మించిన లిక్కర్ స్కామ్ జరిగిందన్న ఆరోపణల వెనుక నిగూఢార్థం ఇదేనా…? అంటే అవునంటూ చెవులు కొరుక్కుకుంటున్నాయి టీడీపీ వర్గాలు.
ఏపీలో ఢిల్లీకి మించిన మద్యం కుంభకోణం జరిగిందని ఇటీవల ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు ఆరోపించారు. పార్లమెంట్ సమావేశాల్లో ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఏపీలో జరిగిన లిక్కర్ స్కామ్‌పై విచారణ జరిపించాలని కోరారు. దీని వెనుక.. పెద్ద ప్లానే ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. టీడీపీ చాలా వ్యూహాత్మకంగా ఈ స్టెప్ వేసిందని అంటున్నారు. స్కిల్ స్కామ్‌లో చంద్రబాబును జైలుకు పంపినట్టే… మద్యం స్కామ్‌లో జగన్‌ను జైలుకు పంపాలన్నది టీడీపీ ప్లాన్ అని సమాచారం. ఢిల్లీ మద్యం కుంభకోణంలో.. అప్పటి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో పాటు.. ఆయన కేబినెట్‌లోని కొందరు మంత్రులు కూడా జైలుకు వెళ్లొచ్చారు.
Also Read : పవన్ జాతకం సూపర్ – మరి చంద్రబాబు, జగన్ పరిస్థితి ఏంటి?
ఏపీలో కూడా ఆ తరహా స్కామ్ జరిగిందని ఎంపీ చెప్పడం వెనుక.. జగన్‌ను అరెస్ట్ చేయించాలనే ప్లాన్ ఉందన్న చర్చ జరుగుతోంది. ఈ అంశంలో ప్రధాని మోడీ రియాక్షన్ ఏంటి..? టీడీపీ ప్లాన్‌కు మోడీ సహకరిస్తారా…? జగన్‌పై సీబీఐ, ఈడీ దర్యాప్తు వేస్తారా..? అనేది ఉత్కంఠగా మారింది. ప్రస్తుతానికి ఈ విషయంపై పెద్దగా చర్చించకుండా… ప్రస్తావించి వదిలేసింది టీడీపీ. దీంతో… వైసీపీ నేతలు కూడా సైలెంట్‌గానే ఉన్నారు. అయితే…. ఎన్నికలు దగ్గరయ్యే సమయంలో… ఈ అంశాన్ని టీడీపీ ఒక అస్త్రంగా మలుచుకుంటుందా..? అన్నది చూడాలి.
ఇవి కూడా చదవండి ..
-
హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎంఐఎందేనా..? – పోటీకి ముందుకు రాని ప్రధాన పార్టీలు
-
16 రోజులు జైల్లో నరకం చూశా- సీఎం రేవంత్‌రెడ్డి భావోద్వేగం
-
వైఎస్ షర్మిలపై పెరుగుతున్న వ్యతిరేకత- కాంగ్రెస్‌ను వీడుతున్న కడప నేతలు
-
కాశీనాయన క్షేత్రం కాంట్రవర్సీ – పవన్‌కు గట్టి కౌంటర్ ఇచ్చిన జగన్
-
టీడీపీకి కనిపించని శత్రువు పవనే..! – ఈ సత్యం చంద్రబాబు గ్రహించేదెప్పుడో..?