తెలంగాణ

కాంగ్రెస్ కు జై కొట్టిన టీడీపీ… అందుకే నవీన్ ఘన విజయం!

క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- తెలంగాణ రాష్ట్రంలోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గణ విజయం సాధించారు. ఈ విజయం పట్ల ఇప్పటికే కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు కూడా చేసుకున్నారు. అయితే తాజాగా నవీన్ యాదవ్ గెలుపు పై రాష్ట్ర రాజకీయాలలో మరొక అంశం బయటకు వచ్చింది. అసలు ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరికి ఓటు వేశారు అని ప్రతి ఒక్కరు చర్చిస్తున్న నేపథ్యంలో.. రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు, కాంగ్రెస్ అభ్యర్థికే ఓటు వేసి గెలిపించినట్లుగా సమాచారం. ఇక నవీన్ తండ్రి శ్రీశైలం యాదవ్ అలాగే మాగంటి గోపీనాథ్ అప్పట్లోనే ఒక కోర్ తెలుగుదేశం పార్టీ నేతలు. మాగంటి గోపీనాథ్ 2014లో తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచి ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం అమీర్పేట్ లో నందమూరి తారక రామారావు విగ్రహం పెడతానని చెప్పడం నవీన్ యాదవ్ గెలుపుకు దోహదపడ్డాయి. ఇక గ్రౌండ్ లెవెల్ లోను ఓ సామాజిక వర్గంతో సమావేశమై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీగా మద్దతు కూడగట్టుకున్నారు. మరోవైపు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూటమినేతలు కలిసి పనిచేస్తున్న వేళ.. తెలంగాణలో మాత్రం తెలుగుదేశం పార్టీ నేతలు బిజెపికి కాకుండా కాంగ్రెస్కే ఓట్లు వేసినట్లుగా సమాచారం. ఒకపక్క బీఆర్ఎస్ మరో పక్క బీజేపీ పార్టీలు రెండు కూడా తెలుగుదేశం పార్టీ ఓట్లు మాకే పడతాయి అని ఆశ భావం వ్యక్తం చేశారు. ఒకవేళ తెలుగుదేశం పార్టీ నేతలు బీఆర్ఎస్కు లేదా బిజెపికి మద్దతు తెలిపి ఉంటే మెజారిటీ కాస్త తగ్గేదేమో. ఏది ఏమైనా కూడా చివరికి కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు డల్ అయిపోయారు.

Read also : మరో అల్పపీడనం.. నాలుగు రోజులపాటు భారీ వర్షాలు!

Read also : ప్రతి ఒక్కరూ అంకితభావంతో పని చేయాలి : చైర్మెన్ కుంభం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button