అంతర్జాతీయం

భారత్‌ పై కావాలనే టారిఫ్స్‌, జేడీ వాన్స్‌ సంచలన వ్యాఖ్యలు!

JD Vance On US Tariffs: భారత్ పై అమెరికా వాణిజ్య యుద్ధానికి దిగింది. ఇండియా దిగుమతులపై ఏకంగా 50 శాతం టారిఫ్ విధించారు ఆదేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇప్పటికే, 25 శాతం పన్నులు అమలు అవుతుండగా, రేపటి నుంచి 50 శాతం కాబోతోంది. అమెరికా పన్నుల విధింపుపై అన్ని వర్గాల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తం అయ్యింది. ఈ నేపథ్యంలో భారత్ పై టారిఫ్ లు విధించడానికి గల కారణాలను వివరించే ప్రయత్నం చేశాడు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్. కావాలనే భారత్ పై 50 శాతం సుంకాలు విధించినట్లు తెలిపారు.

రష్యాను టార్గెట్ చేసేందుకే..

రష్యాను అడ్డుకునేందుకే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌.. భారత్‌ పై అధిక టారి ఫ్‌లు విధించినట్లు వాన్స్ వివరించారు. తాజాగా ఓ వీడియా సంస్థతో మాట్లాడిన వాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. “రష్యాపై ఒత్తిడి పెంచేందుకు అధ్యక్షుడు ట్రంప్‌ కావాలనే భారత్‌ పై అధిక టారిఫ్స్‌ విధించారు. ఆయిల్‌ ద్వారా వస్తున్న ఆదాయాన్ని ఆపాలనే లక్ష్యంతోనే ఈ చర్యలు తీసుకున్నారు. చమురు నుంచి వచ్చే ఆదాయం తగ్గిపోతే ఉక్రెయిన్‌ పై దాడులు చేయడం మాస్కోకు కష్టం అవుతుంది. దాడులను ఆపమని రష్యాను బలవంతం చేయడానికి ట్రంప్ దూకుడుగా ఆర్థిక ఒత్తిడి విధానాన్ని అవలంభించారు. భారత్‌ పై సెకండరీ టారిఫ్స్‌ ఇందులో భాగంగానే జరిగింది. హత్యలను ఆపితే రష్యాను ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోకి తిరిగి ఆహ్వానించొచ్చు. కానీ, దాడులు కొనసాగితే అది ఒంటరిగా ఉండాల్సి వస్తుంది” అని అని జేడీ వాన్స్‌ వెల్లడించారు. మరోవైపు అమెరికా 50 శాతం టారిఫ్ లు రేపటి నుంచి అమలు కానున్న నేపథ్యంలో ప్రధాని కార్యాలయం ఇవాళ కీలక సమావేశం కాబోతోంది. అమెరికా టారిఫ్ లపై చర్చించనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button