
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఆస్తులు మరియు పత్రాలను తమిళనాడు ప్రభుత్వానికి బెంగళూరు కోర్టు అధికారులు తాజాగా అప్పగించారు. అయితే ఇందులో కొన్ని ఆసక్తికర విషయాలు ఉన్నాయి. మాజీ ముఖ్యమంత్రి జయలలిత దగ్గర ఉన్నటువంటి ఆస్తులను చూస్తే అందరూ షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే ఆమె దగ్గర ప్రస్తుతం 27 కిలోల బంగారం, 1116 కిలోల వెండి, రత్నాలు మరియు వజ్రాభరణాలు ఉన్నాయి. అంతేకాకుండా పదివేల చీరలు, 750 జతల చెప్పులు, 1672 ఎకరాల భూముల పత్రాలు, ఇళ్ల దస్తావేజులు, 8376 పుస్తకాలు ఉన్నాయట. అయితే వీటి విలువ తెలిస్తే కచ్చితంగా ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోవాల్సిందే. దాదాపుగా వీటన్నిటి విలువ 4000 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ విషయాన్ని తాజాగా బెంగళూరు కోర్టు అధికారులు తమిళనాడు ప్రభుత్వానికి జయలలిత ఆస్తులు మరియు పత్రాలను అప్పగించిన సమయంలో తెలిసింది.
ఇవి కూడా చదవండి
1.వర్షాలతో ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలి.. కలెక్టర్ సంచిత్ గంగ్వార్
2.వర్షాలతో ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలి.. కలెక్టర్ సంచిత్ గంగ్వార్
3.టార్చర్ భరించలేను.. బీజేపీ నుంచి వెళ్లిపోతా! రాజాసింగ్ సంచలనం