HomeజాతీయంTamilisai: వన్ ఛాన్స్ ప్లీజ్.. తమిళ అసెంబ్లీ ఎన్నికల్లో తమిళి సై!

Tamilisai: వన్ ఛాన్స్ ప్లీజ్.. తమిళ అసెంబ్లీ ఎన్నికల్లో తమిళి సై!

* మైలాపూర్ నియోజకవర్గం నుంచి బరిలోకి

* ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవాలని గట్టి ప్రయత్నం

* గవర్నర్ పోస్ట్ ను వదులుకున్న ఈ మహిళా నేత

క్రైమ్ మిర్రర్, ఎలక్షన్ డెస్క్: తమిళనాడు ఎన్నికల్లో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు తమిళి సై సౌందర రాజన్. వన్ ఛాన్స్ అంటూ ఎన్నికల బరిలో దిగారు. మైలాపూర్ నియోజకవర్గంలో ఈసారి ఆమె బిజెపి అభ్యర్థిగా రంగంలోకి దిగారు. అయితే సిట్టింగ్ సీటు తమదేనంటుంది అధికార డిఎంకె. ఆ పార్టీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే టి వేలు ఉన్నారు. అదే సమయంలో విజయ్ టీవీ కే పార్టీ అభ్యర్థితో పాటు ఎన్టికె అభ్యర్థులు రంగంలోకి దిగారు. ఈ బహుముఖ పోటీలో గెలుపు ఎవరిది అనేది తేల్చడం కష్టం.

అత్యంత పురాతన ప్రాంతం..

తమిళనాడు రాజధాని చెన్నైలో అత్యంత పురాతన ప్రాంతాల్లో మైలాపూర్ నియోజకవర్గం ఒకటి. అయితే ఈ నియోజకవర్గంలో అన్నాడీఎంకేకు మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. ఏడుసార్లు ఇక్కడ ఆ పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు. డీఎంకే రెండుసార్లు మాత్రమే గెలిచింది. 2021 లో డీఎంకే అభ్యర్థిగా టీ వేలు విజయం సాధించారు. చివరిసారిగా 2001లో బిజెపి అభ్యర్థి ఇక్కడ విజయం సాధించారు. సీనియర్ నేతగా ఉన్న కేఎన్ లక్ష్మణ్ గెలిచారు. అయితే ఇన్నాళ్లకు బిజెపి అభ్యర్థి గా పోటీలో దిగుతున్న తమిళ సై సౌందర రాజన్ తప్పకుండా గెలుపొందుతానని ధీమాతో ఉన్నారు. అందుకు తన గవర్నర్ పోస్ట్ ను కూడా ఆమె వదులుకున్నారు.

ఇది పరిస్థితి..

మైలాపూర్ నియోజకవర్గంలో 1,94,731 మంది ఓటర్లు ఉన్నారు. పురుషుల కంటే మహిళా ఓటర్లు అధికం. ఇక్కడ పురుషులు 93,017 ఉండగా మహిళలు 1,01,691 మంది ఉన్నారు. ప్రధానంగా మత్స్యకార సామాజిక వర్గం అధికం. బ్రాహ్మణ సామాజిక వర్గం ఓట్లు కూడా కీలకం. అందుకే ఇక్కడ గెలుపు అనేది ఎవరికి సాధ్యమో చెప్పలేని పరిస్థితి. డీఎంకే పాలనలో సమస్యలు పరిష్కారం కాలేదు అన్న విమర్శలు ఉన్నాయి. దీంతో ఇది తమిళసైకి కలిసి వచ్చే అంశం.

బిజెపిలో అంచెలంచలుగా..

తమిళి సై.. కేవలం తమిళనాడుకే కాదు. తెలంగాణతో పాటు పుదుచ్చేరికి కూడా ఆమె సుపరిచితురాలు. సాధారణ కార్యకర్త స్థాయి నుంచి బిజెపిలో పని చేస్తూ వస్తున్నారు. తమిళనాడు రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలిగా కూడా వ్యవహరించారు. అయితే ఒక్కసారైనా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవాలన్నది ఆమె టార్గెట్. 2006తో పాటు 2011 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఆమెకు ఓటమి ఎదురైంది. 2009 సార్వత్రిక ఎన్నికలతో పాటు 2019 ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన అదృష్టం దక్కలేదు. ఆమె సేవలను గుర్తించిన బిజెపి హై కమాండ్ తెలంగాణ గవర్నర్ పోస్ట్లు ఇచ్చింది. పుదుచ్చేరి లెఫ్ట్నెంట్ గవర్నర్గా కూడా ఆమె వ్యవహరించారు. అయితే ఒక్కసారైనా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవాలని ఆమె బలంగా భావించారు. అందుకే గవర్నర్ పోస్ట్ ను సైతం వదులుకున్నారు. ఈ ఎన్నికల్లో గెలుపొందాలని సర్వశక్తులు ఒడ్డుతున్నారు. మరి మైలాపూర్ నియోజకవర్గ ప్రజలు ఆమెకు ఛాన్స్ ఇస్తారో లేదో చూడాలి.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను. 2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు