క్రైమ్

యాదగిరిగుట్ట కొండపై చింతపండు దొంగతనం…

గోదాం నుండి 10 బస్తాల ను ఎత్తిన సెక్యూరిటీ సిబ్బంది.

యాదగిరిగుట్ట, క్రైమ్ మిర్రర్: పవిత్ర యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం కొండపై దారుణమైన దొంగతన ఘటన వెలుగులోకి వచ్చింది. కొండపైన ఉన్న గోదాం నుండి 10 బస్తాల చింతపండును అక్రమంగా తరలిస్తుండగా సెక్యూరిటీ ఉద్యోగులు చేతులెరిగిపోయారు. ఆలయ ప్రాంగణంలోని గోదాంలో నిల్వ చేసిన ఆ చింతపండును విధిగా కాపాడాల్సిన వారు కంచే చేను మేసినట్టుగా వ్యవహరించడం పట్ల భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఘటనపై ఆలయ అధికారులు విచారణ ప్రారంభించినప్పటికీ, యాదగిరిగుట్ట ఆలయంలో పూర్తి స్థాయి ఎండోమెంట్ ఆఫీసర్ (EO) లేకపోవడం కారణంగా అధికారులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. భద్రతా సిబ్బందే దొంగతనాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఆలయ పరిపాలన పద్ధతిపై అనేక సందేహాలు కలిగిస్తున్నాయి. ఈ సంఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ భక్తులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button