
AI: సోషల్ మీడియాలో తరచూ సెలబ్రెటీలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ కావడం నేటి డిజిటల్ యుగంలో సాధారణ విషయమే. అయితే ఇటీవల టాలీవుడ్ ప్రముఖ నటీమణులు శ్రీలీల, తమన్నా పేరుతో కొన్ని చిత్రాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అవి చూసిన వారికి మొదటి క్షణంలో నిజమైన ఫోటోలుగా అనిపించినప్పటికీ, పరిశీలన చేస్తే ఈ చిత్రాలు వారి అసలు సోషల్ మీడియా ప్రొఫైళ్లలో ఎక్కడా కనిపించడం లేదు. దాంతో ఈ ఫోటోలు నిజంగా వాళ్లవి కావని స్పష్టమవుతోంది.
వైరల్ అవుతున్న ఇమేజెస్‌లో ఇద్దరు హీరోయిన్లు బాత్రూమ్ లాంటి ప్రదేశంలో నిలబడి మిర్రర్ సెల్ఫీలు తీసుకున్నట్టు చూపించబడుతున్నాయి. అయితే ఫోటోలలో శరీరాకృతి ఒకేలా ఉండగా, ముఖం మాత్రమే మార్చినట్లుగా కనిపించడం అనేక సందేహాలను రేకెత్తిస్తోంది. ఈ లక్షణాలు సాధారణంగా ఏఐ జనరేట్ చేసిన చిత్రాల్లో కనిపించే ప్రత్యేక లక్షణాలని నెటిజన్లు గుర్తించి, అవి పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో రూపొందించినవేనని కామెంట్ చేస్తున్నారు.
సోషల్ మీడియా వేదికల్లో గత కొంతకాలంగా ఇలాంటి ఏఐ మార్ఫింగ్ ఘటనలు పెరిగిపోతున్నాయి. చాలా మంది నటీమణుల పేరుతో నకిలీ ఫోటోలు, వీడియోలు తయారు చేసి వైరల్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. కొందరు సెలబ్రిటీలు గతంలో ఇలాంటి సమస్యలతో విసిగి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయము కూడా తెలిసిందే. ఇప్పుడు ఇదే సమస్య తమన్నా మరియు శ్రీలీలపై పడటంతో, వారు కూడా ఈ వ్యవహారంపై అధికారులకు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావచ్చని పరిశ్రమలో చర్చ నడుస్తోంది.
ఏఐ సాంకేతిక విజ్ఞానం అసలు ఉద్దేశం మంచి పనులను సులభతరం చేయడం, సృజనాత్మకతను ప్రోత్సహించడం. కానీ దురుద్దేశంతో వాడితే ఇదే టెక్నాలజీ అపోహలు, అపకీర్తి, ప్రైవసీ ఉల్లంఘనలకు కారణమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ నిపుణులు ఏఐ సామర్థ్యాన్ని బాధ్యతగా వినియోగించుకోవాలని పలుమార్లు సూచించినా, ఇలాంటి ఘటనలు మాత్రం ఆగడం లేదు. దీంతో ఏఐ ఇమేజ్ జనరేషన్ టూల్స్‌లో కఠిన నియంత్రణలు, భద్రతా గోడలు, ప్రైవసీ పరిరక్షణ ఫీచర్లు అనుసరించాలని డిమాండ్లు రోజు రోజుకూ పెరుగుతున్నాయి.
ఏఐ ఆధారిత నకిలీ చిత్రాలు సెలబ్రెటీలకే కాకుండా సాధారణ వ్యక్తులపైనా ప్రభావం చూపగలవు. ఒకసారి నకిలీ ఫోటో నెట్టింటకు వెళితే దానిని ఆపడం, తొలగించడం చాలా కష్టం. దీనివల్ల వారి వ్యక్తిగత జీవితాలు, వృత్తి, సమాజంలో వారి ఇమేజ్ దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఏఐ దుర్వినియోగాన్ని నిరోధించేందుకు ప్రభుత్వం, టెక్ కంపెనీలు, సోషల్ మీడియా సంస్థలు కలిసి కట్టుగా చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ALSO READ: Alto k10: ఇక మీరు కారు కొనాలనుకుంటే OLX అవసరం లేదండోయ్.. భారీగా ధర తగ్గించిన మారుతి





