Sunday, March 15, 2026
Homeతెలంగాణకొత్త చెరువు కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోండి. . గ్రామస్తులు చెరువు వద్ద ఆందోళన

కొత్త చెరువు కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోండి. . గ్రామస్తులు చెరువు వద్ద ఆందోళన

రంగారెడ్డి,క్రైమ్ మిర్రర్:- మాడ్గుల మండలం అప్పారెడ్డిపల్లి గ్రామంలో ఉన్న కొత్త చెరువు కబ్జాల వ్యవహారం రోజురోజుకూ ఉద్రిక్తంగా మారుతోంది. చెరువు ఆక్రమణలను తొలగించాలని గ్రామస్థులు గత నెల రోజులుగా ఆందోళన చేస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల ఇరిగేషన్ అధికారులు గ్రామాన్ని సందర్శించి చెరువు కబ్జాలను తొలగిస్తామని హామీ ఇచ్చారు. అయితే అధికారులు వెళ్లిన రెండో రోజుకే కబ్జాదారులు అలుగు నీటికి అడ్డంగా కట్టలు వేసి, అధికారులు ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ సవాల్ విసురుతున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

ఇరిగేషన్ చట్టం సెక్షన్–7 ప్రకారం చెరువులు, నాలాలపై ఉన్న ఆక్రమణలను అధికారులు తమ అధికారంతో తొలగించి, ఆక్రమణదారులపై పోలీస్ కేసులు నమోదు చేయాల్సి ఉంటుంది. అలాగే వాల్టా చట్టం సుప్రీంకోర్టు ఇచ్చిన జగపాల్ సింగ్ స్టేట్ అఫ్ పంజాబ్ 2011 తీర్పు ప్రకారం చెరువులు, సామూహిక భూములను ఆక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టంగా పేర్కొనబడింది. అయినప్పటికీ ఇరిగేషన్ అధికారులు చర్యలు తీసుకోవడంలో ఆలస్యం చేస్తున్నారని గ్రామస్థులు విమర్శిస్తున్నారు.
అప్పారెడ్డిపల్లి కొత్త చెరువు ఆక్రమణల వల్ల చెరువు వ్యవస్థ దెబ్బతిని భూగర్భ జలాలు తగ్గిపోయే ప్రమాదం ఉందని, దీని ప్రభావం అప్పారెడ్డిపల్లి గ్రామంతో పాటు పరిసర గ్రామాలపై కూడా పడే అవకాశం ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెరువు నాశనం అయితే భవిష్యత్తులో భూముల విలువ కూడా భారీగా పడిపోతుందని వారు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో గ్రామస్థులు చెరువు వద్దకు చేరుకొని చెరువుల కబ్జా ఆపండి.ప్రకృతిని కాపాడండి అనే నినాదాలతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సర్వే నంబర్ 168లోని చెరువు ప్రాంతంలో వాల్టా ,ఇరిగేషన్ చట్టాలకు విరుద్ధంగా పలు ఉల్లంఘనలు జరిగాయని వారు పేర్కొన్నారు. అలుగు నుంచి వచ్చే నాలాకు అడ్డంగా ఫెన్సింగ్ వేయడం, నీటి ప్రవాహం అడ్డుకట్టయ్యేలా కట్టలు వేయడం, చౌసెవే మీదుగా నీరు వెళ్లకుండా భూమి ఎత్తు పెంచడం, నాలా ప్రాంతంలో బోర్ వేయడం వంటి చర్యలు జరిగాయని ఆరోపించారు.
ఈ కబ్జాలపై వెంటనే చట్టరీత్యా చర్యలు తీసుకొని చెరువు ఆక్రమణలను పూర్తిగా తొలగించాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో తోట చంద్రయ్య, బన్నె యాదయ్య, ఉడుతల సత్తయ్య, గుడితండా సాగర్, అడవి రాములు, పల్లేటి నర్సింహా, తోట పాపయ్య, రోడ్డ మల్లయ్య, పల్లేటి యాదయ్య, పులికంటి శ్రీరాములు, పల్లేటి రాములు, పల్లేటి జంగయ్య, పులికంటి యాదయ్య, తోట శ్రీకాంత్, తోట శివ, పల్లేటి శ్రీశైలం, తోట జంగయ్య మరియు గోవిందు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments