
– వ్యాపార కేంద్రాలుగా మారిన ఆధ్యాత్మిక నిలయాలు
– ఆలయ యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన హిందూ సంఘాలు
క్రైమ్ మిర్రర్, మహాదేవపూర్:- జయశంకర్ జిల్లా,మహాదేవపూర్ మండల కేంద్రంలోని అయ్యప్ప దేవాలయంలో అర్చనలు అభిషేకాలు పేద భక్తులకు అందనంత దూరంలో ఉన్నాయి. అర్చనకు మూడు.. అభిషేకానికి ఆరు.. అంటూ ఆలయంలో జరిగే ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమానికి ఒక్కో రేట్ ఫిక్స్ చేయడంతో ఆలయానికి వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆలయాలు వ్యాపార కేంద్రాలు కాకూడదని గతంలో హైకోర్టు వంటి సంస్థలు స్పష్టం చేసినా ఆలయ యాజమాన్యాలు మాత్రం వ్యాపారాలకు కేంద్రబిందువుగా ఆలయాలను మార్చుకోవడంతో హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
Read also : అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని.. ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య
వివరాల్లోకి వెళితే… ఆదివారం ఉదయం మహాదేవపూర్ మండల కేంద్రంలోని అయ్యప్ప దేవాలయానికి అభిషేకానికి వచ్చిన అయ్యప్ప మాలధారణ భక్తులు ఆలయ యాజమాన్య తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 500 రూపాయలు ఇస్తేనే అభిషేకం చేస్తాం, లేదు అంటే ఆలయంలో నుంచి వెళ్ళండి అంటూ ఆలయంలోని అర్చకులు అయ్యప్ప మాలధారణ భక్తులతో ప్రవర్తించిన తీరు ‘ఆలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలు కాదు..వ్యాపార కేంద్రాలు’ అని స్పష్టం అవుతుంది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురి అయిన అయ్యప్ప మాలధారణ భక్తులు మహాదేవపూర్ అయ్యప్ప ఆలయంలో భక్తి ముసుగులో జరుగుతున్న వ్యాపారంపై హిందూ సంఘాలకు జరిగిన విషయాన్ని స్పష్టం చేయగా.. గతంలో కూడా సదరు ఆలయంపై ఇలాంటి ఫిర్యాదులు అందాయని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని ఆలయానికి వెళ్లే ఏ ఒక్క భక్తుడు అసంతృప్తి చెందకూడదని అన్నారు.
Read also : Electric Bike Fire: నడిరోడ్డుపై ఎలక్ట్రిక్ స్కూటర్‌లో మంటలు





