
క్రైమ్ మిర్రర్, తమిళనాడు న్యూస్ :- కరూర్ తొక్కిసలాట ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిపోయింది. అసలు ఈ ఘటన ఎందుకు జరిగింది?.. సరే అయిపోయింది ఏదో అయిపోయింది.. కానీ ఇందులో తప్పు ఎవరిది?.. అని చాలానే ప్రశ్నలు వస్తున్నాయి. ఈ ఘటనలపై చాలామంది చాలా రకాలుగా ప్రశ్నలు వేస్తున్నారు. తప్పు అయితే జరిగింది కానీ విచారణలో ఎవరిని తప్పుగా భావించాలి అనేది మాత్రం ఎవరికీ అర్థం కావట్లేదు. ఇప్పటికే తమిళనాడు సీఎం స్టాలిన్ ఈ ఘటనపై స్పందిస్తూ చనిపోయిన వారికి పది లక్షల నష్టపరిహారం ఇస్తామని వెల్లడించారు. చనిపోయిన వారి గురించి ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు అని అన్నారు. మరోవైపు పోలీసులు టీవీకే పార్టీ మా దగ్గర పదివేల మందికి మాత్రమే పర్మిషన్ తీసుకున్నారు. మేం కూడా దానికి తగ్గట్టుగా పోలీసులను ఏర్పాటు చేశాం. కానీ అక్కడికి ఏకంగా లక్షకు పైగా జనం రావడంతో తొక్కిసలాట జరిగింది… ఇందులో మాకేం సంబంధం అని పోలీసులు చేతులెత్తేశారు.
Read also : తొలి ముడు రోజుల్లోనే రికార్డ్ కలెక్షన్స్… తన కెరీర్ లోనే మొదటిసారి!
ఇక మరోవైపు టీవీకి పార్టీ చాలా ఆలస్యంగా స్పందిస్తూ… పోలీసులు లాఠీ చార్జ్ చేయడం వలనే… ప్రజల మధ్య తొక్కిసలాట జరిగి 40 మంది చనిపోవడానికి కారణం అయ్యారని కోర్టులో పిటిషన్ కూడా వేసింది. అలాగే చనిపోయిన వారికి టీవీకే పార్టీ ఒక్కొక్కరికి 20 లక్షలు ప్రకటించింది. ఇలా ప్రతి ఒక్కరు కూడా మాకేం సంబంధం లేదు అని ఏదో ఒకటి చెప్తూ చేతులెత్తేశారు. అసలు నిజానికి ఇక్కడ తప్పు పోలీసులదా?.. టీవీకే పార్టీ దా?.. లేక అధికార పార్టీ చేసిన భద్రత లోపం అని చాలానే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. మరోవైపు ప్రజలది కూడా చాలా పెద్ద తప్పు అని… నిజానికి అంతమంది అక్కడ పట్టరని తెలిసి కూడా ఎలా వచ్చారు అని.. చాలామంది టీవీకే పార్టీ ఫ్యాన్స్ పై కూడా మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా చాలామంది కూడా ఇలాంటి రాజకీయ నాయకుల వెంబడి తిరిగే మనం ఇలా తయారయ్యాం… అది ఇతర దేశాలకు వెళ్తే సెలబ్రిటీలకు మామూలు వ్యక్తులకు తేడానే ఉండదు అని మనం కూడా మారాలని… వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇండియాలో ఇటువంటివి మరోసారి జరగకుండా ఉండాలి అంటే సామాన్య ప్రజలు కూడా మారాలి… ఎవరికి వారే హీరో అనుకోని ఉంటే తప్ప… సెలబ్రిటీల మోజులో పడకుండా ఉంటామని అంటున్నారు. కాగా ఈ మధ్య తొక్కిసలాట ఘటనలు మన ఇండియాలో చాలా చోట్ల జరిగాయి. సినిమా పరంగాను, రాజకీయ పరంగాను, భక్తి పరంగాను ఎన్నో ఘటనలు చోటు చేసుకున్నాయి. ఎంతోమంది చనిపోగా, చాలామంది గాయపడ్డారు.
Read also : ఆదాయం ఎక్కువే..అవస్థలు అంతకుమించినవే..!?