క్రీడలు

తెలుగోడు విరుచుకుపడడానికి అతడే కారణం?

క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్ :- యూఏఈ వేదికగా జరిగినటువంటి ఆసియా కప్ అయితే తాజాగా ముగిసింది. ఈ ఆసియా కప్ 2025 ట్రోఫీని భారత్ చేతులారా అందుకోకపోయినా.. చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్ చాలా ఉత్కంఠంగా కొనసాగింది. కానీ చివరికి టీమిండియా ఘన విజయం సాధించింది. భారత్ ఘనవిజయం సాధించడానికి ముఖ్య కారణం తెలుగు బిడ్డ తిలక్ వర్మ. నిజం చెప్పాలంటే ఫైనల్ మ్యాచ్లో తిలక్ వర్మ లేకుంటే కచ్చితంగా మ్యాచ్ ఓడిపోతుంది అని ప్రతి ఒక్కరికి అర్థం అయ్యే ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్కరూ గమనిస్తే… ఫైనల్ మ్యాచ్ లో తిలక్ వర్మ చాలా విరుచుకుపడి ఆడారు. దానికి కారణం ఏంటో తాజాగా ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Read also : ఎన్నికల కోడ్ ఎఫెక్ట్.. పెద్ద ఎత్తున తనిఖీలు!

ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ లో పాకిస్తాన్ పై తిలక్ వర్మ చెలరేగి ఆడడానికి పాకిస్తాన్ వికెట్ కీపర్ అయినటువంటి మహమ్మద్ హరీష్ చేసిన స్లెడ్జ్ ఏ కారణమే అని తెలుస్తుంది. ఎందుకంటే తిలక్ వర్మ 3 పరుగులు వద్ద ఉన్నప్పుడు… ‘ ఇది ముంబై కాదు.. ఐపీఎల్ కాదమ్మా’.. అంటూ గట్టిగా అరుస్తూ తిలక్ వర్మను రెచ్చగొట్టాడు. ఇక ఆ మాటలు విన్న తిలక్ వర్మ ఆ సమయంలో చాలా కూల్ గా ఉండి.. కొద్దిసేపటి తరువాత నుంచి పాకిస్తాన్ బౌలర్ల పై విరుచుకుపడ్డాడు. మ్యాచ్ గెలిచిన అనంతరం కూడా తిలక్ వర్మ విజయ సెలబ్రేషన్స్ చూస్తే ప్రతి ఒక్కరికి ఇది కదా మనకి కావాల్సింది అని ఇండియన్ అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. ఒక తెలుగోడు పాకిస్తాన్ దేశానికి ఓటిమంటే ఏంటో రుచి చూపించాడు అంటూ రెండు తెలుగు రాష్ట్రాల వ్యక్తులు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. మ్యాచ్ అనంతరం తిలక్ వర్మను ప్రతి ఒక్కరు కూడా అభినందించారు.

Read also : సుధీర్ ఫ్యాన్స్ కు సూపర్ న్యూస్.. భారీ బడ్జెట్ సినిమాలో హీరోగా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button