
గట్టుప్పల, క్రైమ్ మిర్రర్:- గట్టుప్పల మండలం, తెరటు పల్లికి చెందిన ఈ ఎల్వీ భాస్కర్ ఫౌండేషన్ చైర్మన్ భాస్కర్ ఇటీవల కాలంలో చేస్తున్న హడావిడి కొన్ని ఊహగానాలకు తెర లేపుతోంది అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేపట్టడంతో పాటు శుక్రవారం రాత్రి దసరా ఆత్మీయ సమ్మేళనం పేరుతో గట్టుప్పలలో ఒక ఈవెంట్ కూడా నిర్వహించారు. సేవా కార్యక్రమాలతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో తన పేరు పబ్లిసిటీ అయ్యేందుకు కూడా గట్టిగానే ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఈవెంట్ కార్యక్రమాన్ని చేపట్టారని ప్రచారం జరుగుతుంది.
ఈ విషయమై ఆయన మాట్లాడుతూ బిజినెస్ మూలంగా ఊరికి చాలా కాలం దూరంగా ఉన్నానని అందర్నీ కలుసుకోవడానికి ఇలా ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశానంటూ చెప్పుకొచ్చారు. అన్ని రాజకీయ పార్టీల నాయకులను కలిసి ఆహ్వానించినట్లు తెలిపారు. అవసరమైతే యూత్ సమ్మేట్ ఏర్పాటు చేసి ఉద్యోగ, ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తానంటూ తెలిపారు. కానీ గట్టుప్పలలో నిర్వహించిన ఈవెంట్ కావచ్చు అంతకు ముందు చేపడుతున్న కార్యక్రమాలు కావచ్చు ఇవన్నీ రాజకీయరంగు అలుముకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇది ఇలా ఉండగా భాస్కర్ బీసీలు వదిలిన బుల్లెట్టు అంటూ ఆయన అభిమానులు సంబోధిస్తుండడం. చౌటుప్పల లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ట్రాఫిక్ పోలీసులు తొలగించినప్పుడు ఇంకెంతకాలం ఈ బానిస బతుకులంటూ ఫ్లెక్సీలు తొలగించే దృశ్యానికి పాటలు యాడ్ చేయడం ఇవన్నీ కూడా బీసీ నినాదంతో రాజకీయ అరంగేట్రంగా కొందరు గట్టిగా అభిప్రాయపడుతున్నారు.
ఇక ఈవెంట్ కు వచ్చిన వారిలో బీసీ నేతలు ఎక్కువగా కనబడుతుండడం బీసీ నినాదానికి ఊతం ఇస్తున్నట్లుగా అవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. గతాన్ని ఒకసారి పరిశీలిస్తే ఇలా పలువురు రాజకీయ నేతలు మొదట సేవా కార్యక్రమాలతోనే వచ్చి తీరా ఎలక్షన్ వచ్చేటప్పటికి ప్రజల అవకాశం ఇస్తే పోటీకి సిద్ధమని ఏదో ఒక పార్టీల్లో చేరి అభ్యర్థులుగా మారిన వారే ఉన్నారు. మరి ఈ ఎల్ వి ఫౌండేషన్ భాస్కర్ ఈ ప్రయాణం ఇలాగే కొనసాగుతుందా లేక పాలిటిక్స్ లోకి మల్లుతుందా అనేది వేచి చూడాల్సి ఉంటుంది.
Read also : సుప్రీంకోర్టు కేసులు ఎఫెక్ట్… ఈ గ్రామాల్లో స్థానిక ఎన్నికలు బంద్?
Read also : కేవలం నాలుగు రోజుల్లోనే 800 కోట్లు సంపాదన.. మద్యం అమ్మకాలలో రికార్డ్!