
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:- ఐసీసీ టి20 వరల్డ్ కప్ మరి కొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. అయితే తాజాగా భారత దేశంలో టి20 వరల్డ్ కప్ ఆడే ప్రసక్తి లేదు అని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ సంచలన నిర్ణయం తీసుకుంది. భద్రతా దృష్ట్యా భారతతో జరిగేటువంటి అన్ని మ్యాచ్లను కూడా శ్రీలంకకు మార్చాలి అని గత కొద్ది రోజుల క్రితం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ కోరిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఐసీసీ మాత్రం దానికి నిరాకరించింది. ఈరోజే మీ తుది నిర్ణయాన్ని వెల్లడించాలి అని.. ఒకవేళ ఇండియాలో ఆడడం కుదరదు అంటే మీరు వరల్డ్ కప్ నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది అని ICC ప్రకటించింది. అయితే ఐసీసీకి స్పందిస్తూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ ఇండియాలో అయితే ఆడే ప్రసక్తి లేదు అని చెప్పింది. తమకు వరల్డ్ కప్ ఆడాలని ఉంది కానీ ఇండియాలో ఆడబోము అని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ తెలిపింది. వేదికలు మార్చితేనే మా నిర్ణయంలో మార్పు ఉంటుంది అని బంగ్లాదేశ్ స్పష్టం చేసింది. మరి ఈ విషయంపై ఐసీసీ మళ్ళీ ఎలాంటి స్పందన ఇస్తుంది అనేది వెయిట్ చేయాల్సిందే.
Read also : ఫుల్ జోష్ లో విజయ్ పార్టీ అభిమానులు.. కారణమేంటంటే?
Read also : మైదానంలో ఆడడం ఒక ఎత్తు.. ఇంట్లో చూడడం మరో ఎత్తు : రోహిత్ శర్మ





