తెలంగాణ

బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి, రాష్ట్రంలో భారీ వర్షాలు

Heavy Rain In Telangna: రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు  కురుస్తున్నాయి. ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడుతున్నారు. ఓవైపు బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడటం, మరోవైపు నైరుతి రుతుపవనాలు చురుకుగా కదలడంతో రాష్ట్రంలో వచ్చే నాలుగురోజులు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు ప్రజలకు పలు కీలక హెచ్చరికలు చేసింది.

పలు జిల్లాల్లో భారీ వర్షాలు

అల్పపీడన ద్రోణి, నైరుతి రుతుపవనాల ప్రభావంతో మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిశాయి. ముఖ్యంగా  ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భదాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసినట్టు వాతావరణ కేంద్రం వెల్లడించింది. బుధ, గురువారాల్లో ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతాయని తెలిపింది. అటు  గంటకు 30 నుంచి 40 కిమీ వేగంతో బలమైన గాలులు వీస్తాయని హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది.

భద్రాద్రిలో అత్యధిక వర్షపాతం నమోదు

ఇక గడిచిన 24 గంటల్లో భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలో అత్యధికంగా 6.10 సెం.మీ వర్షపాతం నమోదైనట్టు వాతావరణ అధికారులు వెల్లడించారు. అటు హైదరాబాదులో ఇప్పటికే వర్షాలు కుస్తుండగా, భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు.  అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

Read Also: ఉప్పొంగుతున్న గోదావరి!..మేడిగడ్డ బ్యారేజ్ వద్ద పెరిగిన వరద ప్రవాహం

Back to top button